Chicken Kebabs : ఓవెన్ లేక‌పోయినా స‌రే.. చికెన్ క‌బాబ్స్‌ను ఇలా రుచిక‌రంగా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..

Chicken Kebabs : చికెన్‌తో స‌హ‌జంగానే చాలా మంది అనేక ర‌కాల వంట‌ల‌ను చేస్తుంటారు. చికెన్‌తో కూర‌, వేపుడు వంటి వాటిని త‌యారు చేస్తుంటారు. అయితే చికెన్‌తో మ‌నం క‌బాబ్స్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. కాస్త శ్ర‌మించాలే కానీ రెస్టారెంట్ స్టైల్‌లో ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌బాబ్స్ ఇంట్లోనే త‌యార‌వుతాయి. వీటిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

it is very easy to make Chicken Kebabs  know the recipe
Chicken Kebabs

చికెన్ క‌బాబ్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బోన్‌లెస్ చికెన్ ముక్కలు – 1 కప్పు, పెరుగు – అరకప్పు, ఉల్లిగడ్డ – 1, అల్లం – చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు – 4, ధనియాలపొడి – అర టీస్పూన్, నూనె – వేయించడానికి సరిపడా, గరంమసాలా – పావు టీస్పూన్, కారం – అర టీస్పూన్, ప‌సుపు – అర టీస్పూన్‌, మిరియాలపొడి – పావు టీస్పూన్, నిమ్మ‌ర‌సం – 1 టీస్పూన్‌, జీలకర్రపొడి – పావు టీస్పూన్, పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత.

చికెన్ క‌బాబ్స్ ను త‌యారు చేసే విధానం..

బోన్ లెస్ చికెన్ ముక్క‌ల‌ను ముందుగా శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టాలి. వీటిలో ఉప్పు, కారం, మిరియాల పొడి, నిమ్మ‌ర‌సం, ప‌సుపు వేసి బాగా క‌లిపి ప‌క్కన పెట్టాలి. చికెన్ ముక్క‌ల‌ను 20 నిమిషాల పాటు మారినేట్ చేయాలి. త‌రువాత ఒక గిన్నె తీసుకుని అందులో పెరుగు, ఉల్లిపాయ పేస్ట్‌, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ప‌చ్చి మిర్చి పేస్ట్ వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మంలో ముందుగా మారినేట్ చేసిన చికెన్ ముక్క‌ల‌ను వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్ర‌మాన్ని మ‌ళ్లీ గంట సేపు మారినేట్ చేయాలి.

త‌రువాత క‌బాబ్ ల‌ను గుచ్చేందుకు చిన్న‌పాటి పుల్ల‌ల‌ను తీసుకోవాలి. వాటికి ఒక్కో పుల్ల‌కు వీలైన‌న్ని చికెన్ ముక్క‌ల‌ను గుచ్చాలి. ఇలా అన్ని పుల్ల‌ల‌ను సిద్ధం చేశాక‌.. ఓవెన్ లేదా ఎయిర్ ఫ్రైయ‌ర్‌లో వేసి కాల్చుకోవాలి. దీంతో రుచిక‌ర‌మైన క‌బాబ్స్ రెడీ అవుతాయి. అయితే ఇవి లేని వారు ముందుగా చికెన్ ముక్క‌ల‌ను ఉడికించి ఆ త‌రువాత అన్నీ క‌లిపి సిద్ధం చేయాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని 10 నిమిషాల పాటు ఉంచాక వాటిని మ‌ళ్లీ పుల్ల‌ల‌కు గుచ్చి పుల్కాల‌ను కాల్చే పెనంపై పెట్టి కాల్చుకోవాలి. రంగు బాగా మారేంత వ‌ర‌కు కాల్చాక పెనం మీద నుంచి తీసేయాలి. అనంత‌రం వాటిపై కాస్త నిమ్మ‌ర‌సం పిండి ఉల్లిపాయ ముక్క‌ల‌తో స‌ర్వ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ క‌బాబ్స్ రెడీ అయిన‌ట్లే. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts