Custard Apple : సీతాఫ‌లాల‌ను తింటే ఇన్ని లాభాలా.. ఈ సీజ‌న్‌లో విడిచిపెట్ట‌కుండా తినాల్సిన పండ్లు..

Custard Apple : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో అందుబాటులో ఉండే పండ్ల‌లో సీతాఫ‌లం ఒక‌టి. సీజ‌న్ ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతుంది. చ‌లికాలం మొద‌ల‌య్యే స‌రికి ఇవి మ‌నకు పుష్క‌లంగా ల‌భిస్తాయి. అయితే సీజ‌న్ మొద‌ల‌వుతుంది కాబ‌ట్టి వీటిని ఇప్ప‌టి నుంచే తిన‌డం మొద‌లు పెట్టాలి. దీంతో అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను ముందుగానే పొంద‌వ‌చ్చు. సీతాఫ‌లం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌నుక సీతాఫ‌లాన్ని త‌ప్ప‌నిస‌రిగా తినాలి. ఇక దీన్ని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

wonderful health benefits of Custard Apple must eat
Custard Apple

సీతాఫ‌లంలో పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఈ పండ్ల‌లో విట‌మిన్లు బి5, విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, జింక్‌, కాప‌ర్ వంటి పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమ‌ల‌ను త‌గ్గిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అల‌ర్జీలు రాకుండా చూస్తాయి. అలాగే చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్ల‌లో స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి. ఇవి మ‌న‌కు త్వ‌ర‌గా శ‌క్తిని అందిస్తాయి. క‌నుక ఒక్క సీతాఫ‌లాన్ని తింటే త్వ‌ర‌గా శ‌క్తిని పుంజుకోవ‌చ్చు. నీర‌సంగా ఉన్న‌వారు.. బాగా శారీర‌క శ్ర‌మ చేసి అల‌సిపోయిన వారు ఈ పండ్ల‌ను తింటే త్వ‌ర‌గా శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. తిరిగి ప‌నిచేయ‌డానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. మెద‌డు సైతం యాక్టివ్‌గా మారుతుంది.

ఈ పండ్ల‌లో యాంటీ క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం.. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. అలాగే షుగ‌ర్ ఉన్న‌వారు సైతం ఈ పండ్ల‌ను తిన‌వ‌చ్చు. చాలా మంది సీతాఫ‌లం అంటే తియ్య‌గా ఉంటుంది కాబ‌ట్టి షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయ‌ని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాస్త‌వానికి అందులో ఉండేవి స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు. అవి ర‌క్తంలో నెమ్మ‌దిగా క‌లుస్తాయి. క‌నుక సీతాఫ‌లాన్ని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు. పైగా ఈ పండ్ల‌లో ఉండే పాలిఫినాల్స్‌, ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు కూడా ఈ పండ్ల‌ను నిస్సందేహంగా తిన‌వ‌చ్చు.

ఇక ఈ పండ్ల‌లో ఉండే విట‌మిన్ బి6 మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. దీంతో చురుగ్గా ఉంటారు. ఎల్ల‌ప్పుడూ అల‌ర్ట్‌గా ఉంటారు. అలాగే మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. క‌నుక ఈ పండ్ల‌ను త‌ర‌చూ తినాలి. చిన్నారుల‌కు ఈ పండ్ల‌ను తినిపిస్తే వారు చ‌దువుల్లో రాణిస్తారు. తెలివితేట‌లు పెరుగుతాయి. ఈ పండ్ల‌లో ఆరోగ్య‌క‌ర‌మైన ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. వీటిల్లో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అలాగే వ్యాధులు రాకుండా ఉంటాయి.

సీతాఫ‌లాల్లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది క‌ళ్ల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో కంటి చూపు మెరుగు ప‌డుతుంది. దృష్టి లోపాలు త‌గ్గుతాయి. క‌ళ్ల‌లో శుక్లాలు రాకుండా ఉంటాయి. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్‌, బి విట‌మిన్ల కార‌ణంగా జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఆక‌లి బాగా అవుతుంది. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ త‌గ్గుతాయి. క‌నుక ఇన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందించే సీతాఫ‌లం పండ్ల‌ను ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా తినాలి. దీంతో అనేక పోష‌కాల‌ను, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts