Jaggery And Coconut Burfi : కొబ్బ‌రి, బెల్లంతో మెత్త‌ని స్వీట్‌ను ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ కావాలంటారు..!

Jaggery And Coconut Burfi : మ‌నం ప‌చ్చికొబ్బ‌రితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చికొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో కొకోన‌ట్ బ‌ర్ఫీ కూడా ఒక‌టి. ప‌చ్చికొబ్బరి, బెల్లం క‌లిపి చేసే ఈ బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అలాగే పండ‌గ‌ల‌కు ఇలా కొబ్బ‌రితో బ‌ర్పీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.ఈ బ‌ర్ఫీని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. కొబ్బ‌రితో రుచిగా, నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత మెత్త‌గా ఉండే ఈ కొకోన‌ట్ బ‌ర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొకోన‌ట్ బర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక క‌ప్పు, కాచి చల్లార్చిన పాలు – ముప్పావు క‌ప్పు, బెల్లం తురుము – ముప్పావు క‌ప్పు, యాల‌కులు – 3, నెయ్యి – పావు క‌ప్పు, శ‌న‌గ‌పిండి – ఒక క‌ప్పు.

Jaggery And Coconut Burfi recipe in telugu very tasty everybody likes it
Jaggery And Coconut Burfi

కొకోన‌ట్ బర్ఫీ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఇందులో పాలు, బెల్లం తురుము, యాల‌కులు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత శ‌న‌గ‌పిండి వేసి క‌లుపుతూ వేయించాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని మ‌రో 5 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి మిశ్ర‌మం వేసి క‌ల‌పాలి. దీనిని క‌ళాయికి అంటుకోకుండా వేర‌య్యే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. కొబ్బ‌రి మిశ్ర‌మాన్ని ఇలా ఉడికించిన త‌రువాత మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత నెయ్యి రాసిన లేదా బ‌ట‌ర్ పేప‌ర్ వేసిన ట్రేలోకి లేదా ప్లేట్ లోకి ఈ మిశ్ర‌మాన్ని తీసుకుని పైన స‌మానంగా చేసుకోవాలి. త‌రువాత దీనిని చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి. ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన త‌రువాత ట్రే నుండి అంచుల‌ను వేరు చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. మ‌న‌కు కావ‌ల్సిన ఆకారంల ముక్క‌లుగా క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొకోన‌ట్ బ‌ర్ఫీ త‌యార‌వుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచిగా ఉండ‌డంతో పాటు శ‌రీరానికి కూడా బ‌లం క‌లుగుతుంది. ఈ బ‌ర్ఫీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts