Giloy Stem For Mucus : మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక డ్రింక్ ను తయారు చేసి తీసుకుంటే చాలు దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. చలికాలంలో మనలో చాలా మంది తరుచూ జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాతావరణ మార్పులే ఈ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం. జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తగానే మనలో చాలా మంది యాంటీ బయాటిక్ లను వాడుతూ ఉంటారు. కానీ ఇలా యాంటీ బయాటిక్స్ ను వాడడం వల్ల భవిష్యత్తులో మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం సహజ పద్దతుల ద్వారా ఈ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నించాలి.
జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు ఇప్పుడు చెప్పే కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల చాలా సులభంగా ఈ సమస్యల బయటపడవచ్చు. అలాగే ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే 5 చిన్న తిప్ప తీగ కాడలు, ఒక తిప్ప తీగ ఆకు, 10 తులసి ఆకులు, 4 దంచిన మిరియాలు, చిటికెడు పసుపు, చిన్న అల్లం ముక్క వేసి 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
తరువాత ఈ కషాయాన్ని వడకట్టి కప్పులో పోసుకోవాలి. ఇందులో తగినంత తేనె వేసుకుని గోరు వెచ్చగా తాగాలి. ఇలా వారంలో మూడు సార్లు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఛాతిలో కఫం తొలగిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. అయితే డయాబెటిస్ తో బాధపడే వారు తేనె వేసుకోకపోవడమే మంచిది. జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధించినప్పుడు తరుచూ యాంటీ బయాటిక్ ల మీద ఆధారపడకుండా ఇలా చాలా సులభంగా మనకు లభించే సహజ సిద్ద పదార్థాలతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.