Jaggery Drink : చెరుకు లేకుండానే చెరుకు ర‌సం లాంటి డ్రింక్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Jaggery Drink : వేసవికాలంలో ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది చెరుకు ర‌సాన్ని తాగుతూ ఉంటారు. చెరుకు ర‌సం మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద విరివిరిగా ల‌భిస్తూ ఉంటుంది. చెరుకు ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. చెరుకు ర‌సంలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అయితే చెరుకు లేకుండా అదే రుచితో మ‌నం ఇంట్లోనే బెల్లం ర‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జ్యూస్ 90 నుండి 95 శాతం వ‌ర‌కు అచ్చం చెరుకు ర‌సం లాగే ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. చెరుకు లేకుండా ఇంట్లోనే బెల్లం రసాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం ర‌సం త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

బెల్లం తురుము – 100 గ్రా., అల్లం – అర ఇంచు ముక్క‌, పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, న‌ల్ల ఉప్పు – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, చ‌ల్లటి నీళ్లు – 3 క‌ప్పులు, ఐస్ క్యూబ్స్ – 5.

Jaggery Drink recipe in telugu tastes like sugar cane juice
Jaggery Drink

బెల్లం ర‌సం త‌యారీ విధానం..

ముందుగా జార్ లో బ్లెండ‌ర్ లో బెల్లం తురుము, అల్లం ముక్క‌లు, పుదీనా, న‌ల్ల ఉప్పు, నిమ్మ‌ర‌సం, ఐస్ క్యూబ్స్, చ‌ల్ల‌టి నీళ్లు పోసి 2 నుండి 3 నిమిషాల పాటు బాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ జ్యూస్ ను వ‌డ‌క‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గ్లాస్ లో రెండు లేదా మైడు ఐస్ క్యూబ్స్ వేసి వ‌డ‌క‌ట్టుకున్న బెల్లం ర‌సాన్ని పోయాలి. వీటిపై పుదీనా ఆకుల‌తో గార్నిష్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం ర‌సం త‌యారవుతుంది. ఈ విధంగా ఇంట్లోనే చెర‌కు లేకుండా అలాంటి రుచితోనే క‌మ్మ‌ని బెల్లం ర‌సాన్ని త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. వేసవికాలంలో దీనిని తాగ‌డం వ‌ల్ల రుచితో ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఎండ వ‌ల్ల నీర‌సం రాకుండా ఉంటుంది. దీనిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తాగుతారు.

Share
D

Recent Posts