Parboiled Rice : ఉప్పుడు బియ్యం తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా.. ఎవ‌రెవ‌రికి మంచిది అంటే..?

Parboiled Rice : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది తెల్ల అన్నానికి బ‌దులుగా బ్రౌన్ రైస్ ను తింటున్నారు. బ్రౌన్ రైస్ ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అయితే బ‌రువు త‌గ్గాల‌నుకున్న వారు బ్రౌన్ రైస్ కు బదులుగా పారాబాయిల్డ్ రైస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత చ‌క్క‌టి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పారాబాయిల్డ్ రైస్ లో త‌క్కువ క్యాల‌రీలు, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. అంతేకాకుండా సాధార‌ణ బియ్యం కంటే కూడా ఇందులో థ‌యామిన్, నియాసిన్ వంటి పోష‌కాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి.

పారాబాయిల్డ్ రైస్ ను ధాన్యంపై ఉండే పొట్టు తీయ‌కుండా ముందుగానే ఉడికిస్తారు. త‌రువాత ఇందులో స్టార్చ్ జెల్ లాగా మారే వ‌ర‌కు ఆవిరిపై ఉడికిస్తారు. త‌రువాత ఈ ధాన్యాన్ని ఎండ‌బెట్టి మ‌ర ఆడిస్తారు. ఈ బియ్యం కొద్దిగా ప‌సుపు రంగులో ఉంటాయి. ఈ బియ్యంలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. వీటితో అన్నం వండుకుని తిన‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు. పారాబాయిల్డ్ రైస్ ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బియ్యాన్ని వండుకుని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ఇందులో ఉండే స్టార్చ్ ప్రోబ‌యాటిక్ గా మారి పొట్ట‌లో మంచి బ్యాక్టీరియా శాతాన్ని పెంచుతుంది.

Parboiled Rice benefits who should take it
Parboiled Rice

అలాగే ఈ రైస్ లో గ్లైస‌మిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటుంది. క‌నుక షుగ‌ర్ తో బాధ‌ప‌డే వారు ఈ బియ్యాన్ని వండుకుని తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. పారాబాయిల్డ్ రైస్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. శ‌రీరానికి కావల్సినంత ఐర‌న్ ల‌భిస్తుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు. అంతేకాకుండా ఈ బియ్యంలో ఉండే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ హార్మోన్ల‌ను స‌మ‌తుల్యంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. బ్రౌన్ రైస్ ఎలా అయితే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయో పారాబాయిల్డ్ రైస్ కూడా మ‌న ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts