Janhvi Kapoor : కరోనా నేపథ్యంలో గతంలో అనేక సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో ఆ ట్రెండ్ లేకున్నా.. బాలీవుడ్‌లో మాత్రం థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలంటేనే.. నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. కలెక్షన్లు వస్తాయో.. రావో.. అని భయపడుతున్నారు. అందులో భాగంగానే చాలా వరకు సినిమాలు బాలీవుడ్‌లో ప్రస్తుతం ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఇక తాజాగా జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ అనే సినిమా కూడా ఓటీటీలోనే నేరుగా విడుదల కానుంది.
బాలీవుడ్ యంగ్ దివా జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుడ్‌లక్ జెర్రీ. కామెడీ, క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి సిదార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు. సుభాస్కరన్ , ఆనంద్ ఎల్. రాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధం అవుతోంది.
గుడ్ లక్ జెర్రీ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయనున్నారని సమాచారం. తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా కోలమవు కోకిల. ఈ సినిమాను తెలుగులో కో కో కోకిల పేరుతో రిలీజ్ చేశారు. హిందీలో గుడ్‌లక్ జెర్రీ గా రీమేక్ చేశారు. ఈ సినిమా చివరి దశ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్దం అవుతోంది. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఈ చిత్ర రిలీజ్ తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే జాన్వీ కపూర్ గత చిత్రాలు థియేటర్లలో విడుదలైనా విజయాన్ని సాధించలేకపోయాయి. మరి ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుండడంతో.. ఈ సినిమా అయినా ఆమెకు కలసి వస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.