Vastu Tips : ఇంట్లో శంకువు ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా ?

Vastu Tips : హిందూ పురాణాల్లో శంఖువుకు చాలా ప్రాముఖ్య‌త ఉంది. ఇంటిలో శంఖం ఉండ‌డాన్ని అదృష్టంగా భావిస్తారు. హిందూ సాంప్ర‌దాయంలో ఏదైనా ప‌నిని ప్రారంభించే ముందు శంఖాన్ని మోగిస్తారు. శంఖంలో దేవ‌త‌లు ఉంటార‌నేది ఒక న‌మ్మ‌కం. శంఖం ముందు భాగంలో గంగ, స‌ర‌స్వ‌తిలు ఉంటార‌ని, మ‌ధ్య భాగంలో వ‌రుణ దేవుడు, వెనుక భాగంలో బ్ర‌హ్మ ఉంటార‌ని భావిస్తారు. శంఖాన్ని మోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Vastu Tips keep conch shell in home for these benefits
Vastu Tips

ఇంట్లో శంఖాన్ని ఉంచ‌డం ద్వారా ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొల‌గడ‌మే కాకుండా, సిరి సంప‌ద‌లు, ఆరోగ్యం క‌లుగుతాయి. ఇంట్లో ఎక్క‌డైతే వాస్తు దోషం ఉంటుందో ఆ మూల‌కి శంఖాన్ని ఉంచ‌డం ద్వారా ఆ దోషం తొలగిపోతుంది. శంఖాల‌ల్లో మూడు ర‌కాలు ఉంటాయి. అవి ద‌క్షిణావృత్తి శంఖం, మ‌ధ్యవృత్తి శంఖం, వామవృత్తి శంఖం.

కుడి చేత్తో ప‌ట్టుకునే శంఖాన్ని ద‌క్షిణావృత్తి శంఖం అంటారు. మ‌ధ్య భాగంలో తెరిచి ఉండే శంఖాన్ని మ‌ధ్య‌వృత్తి శంఖం అంటారు. ఎడ‌మ చేత్తో ప‌ట్టుకునే శంఖాన్ని వామ‌వృత్తి శంఖం అంటారు. ద‌క్షిణావృత్తి శంఖాన్ని ల‌క్ష్మి స్వ‌రూపంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల సంప‌ద క‌లుగుతుంద‌ని భావిస్తారు.

ఇంట్లో శంఖాన్ని మోగించ‌డం వ‌ల్ల పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. మాన‌సిక ఒత్తిడిని త‌గ్గిస్తుంది. హైబీపీ ఉన్న వాళ్లు శంఖాన్ని మోగించ‌డం ద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భించ‌డ‌మే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శంఖాన్ని మోగించ‌డం వ‌ల్ల‌ పొట్టకు వ్యాయామం క‌లిగి గ్యాస్‌ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా శంఖువుతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

D

Recent Posts