Janhvi Kapoor : శ్రీదేవి కుమార్తెగా వెండి తెరకు పరిచయం అయినప్పటికీ జాన్వీ కపూర్ మాత్రం తన నటనతో మంచి మార్కులనే కొట్టేసింది. ఆమె నటించిన సినిమాలు హిట్ కాలేదు. కానీ నటిగా ఆమెకు మంచి గుర్తింపే వచ్చింది. ఈ క్రమంలోనే జాన్వీ ప్రస్తుతం పలు వరుస చిత్రాలతో ఎంతో బిజీగా ఉంది. ఇక ఫిట్ నెస్ విషయంలో ఈమె ఎంతో శ్రద్ధ వహిస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడూ జిమ్ లో గంటల తరబడి గడుపుతుంటుంది. అలాగే జిమ్ సెషన్‌లో ఈమె జిమ్ డ్రెస్ వేసుకుని అలరిస్తుంటుంది. ఆమెను ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు ఎగబడుతుంటారు.
ఇక తాజాగా జాన్వీ కపూర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పర్పుల్ కలర్ డ్రెస్ ధరించిన జాన్వీ వర్కవుట్స్ చేస్తుండడాన్ని చూస్తే.. రెండు కళ్లూ చాలడం లేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలను చూసి యువతకు మతులు పోతున్నాయి. ఎల్లప్పుడూ ఆమె ఇలాంటి ఫొటోలనే షేర్ చేస్తూ అలరిస్తుంటుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, మిలి అనే చిత్రాలలో నటిస్తోంది. ఇక ఈమె త్వరలోనే తెలుగు తెరకు కూడా పరిచయం కానుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీకపూర్ స్వయంగా చెప్పారు. జాన్వీ త్వరలో ఎన్‌టీఆర్‌తో కలిసి నటించనుంది. బుచ్చిబాబు అనే సినిమాలో వీరిద్దరూ జంటగా కనిపించనున్నారు.