technology

జియోలో స‌రికొత్త ప్లాన్‌.. 336 వాలిడిటీని ఇస్తున్న ప్లాన్ ఇది.. రీచార్జి ఎంతంటే..?

దేశంలో టెలికాం రంగంలో జియో సంస్థ తెచ్చిన విప్ల‌వం అంతా ఇంతా కాదు. అంత‌కు ముందు వినియోగ‌దారులు ఇంట‌ర్నెట్ లేదా కాల్స్ కోసం భారీగా వెచ్చించేవారు. కానీ జియో వ‌చ్చాక ప‌రిస్థితి మారిపోయింది. కాల్స్ ఫ్రీ అన్నారు, డేటాకు మాత్ర‌మే చార్జిల‌ను వ‌సూలు చేస్తున్నారు. దీంతో ఇత‌ర కంపెనీలు కూడా జియో బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేదు. అయితే ఇటీవ‌ల జియో సంస్థ రీచార్జి ధ‌ర‌ల‌ను పెంచింది. దీంతో చాలా మంది క‌స్ట‌మ‌ర్లు ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. అయితే క‌స్ట‌మ‌ర్ల‌ను కాపాడుకునేందుకు జియో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ప్లాన్ల‌ను ప్రవేశ‌పెడుతూ వ‌స్తోంది. అందులో భాగంగానే తాజాగా మ‌రో ప్లాన్‌ను లాంచ్ చేశారు.

జియో సంస్థ తాజాగా రూ.895 రీచార్జి ప్లాన్‌ను ప్రీపెయిడ్ యూజ‌ర్ల కోసం లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్లు 336 రోజుల వాలిడిటీ పొంద‌వ‌చ్చు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. రోజుకు 50 ఉచిత ఎస్ఎంఎస్‌ల‌ను కూడా ఈ రీచార్జి ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్లు పొంద‌వ‌చ్చు.

jio rs 895 plan launched know the full details and benefits

ఇక ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు 24 జీబీ డేటా వ‌స్తుంది. అయితే కాల్స్ బాగా మాట్లాడుతాం, డేటాతో అంత‌గా ప‌నుండ‌దు అనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. జ‌న‌ర‌ల్‌గా నెల‌కు రూ.300 రీచార్జికి అయితే ఏడాదికి రూ.3600 చెల్లించాలి. కానీ ఈ ప్లాన్‌తో చాలా వ‌ర‌కు డ‌బ్బును ఆదా చేయ‌వ‌చ్చు. క‌నుక కేవ‌లం కాల్స్ మాట్లాడేవారికి ఈ ప్లాన్ అద్భుతంగా సూట్ అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts