కూర‌గాయ‌లు

లైంగిక శ‌క్తిని పెంచే దొండ‌కాయ‌.. విడిచిపెట్ట‌కుండా తినండి..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ‌లు కూడా ఒక‌టి. దొండ‌కాయ‌లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. వీటితో చాలా మంది భిన్న ర‌కాల వంట‌కాల‌ను చేస్తుంటారు. దొండ‌కాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి, వేపుడు ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే వాస్త‌వంగా చెప్పాలంటే దొండ‌కాయతో మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల్లో లైంగిక శ‌క్తి పెరుగుతుంద‌ని వారంటున్నారు.

దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి దొండ‌కాయ‌లు ఒక వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ కాయ‌ల‌ను తింటే విట‌మిన్ ఎ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది కంటిచూపును మెరుగు ప‌ర‌చ‌డంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే ఈ కాయ‌ల్లో ఉండే విట‌మిన్ సి ఇమ్యూనిటీ ప‌వర్‌ను పెంచుతుంది.

dondakaya works like wonderful medicine

ఇక దొండ‌కాయ‌ల‌ను తింటే మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌దు, గ్యాస్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ఈ కాయ‌ల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి కాబ‌ట్టి నొప్పులు, వాపుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇవి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇక దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల పురుషుల్లో జ‌ననావ‌య‌వాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. దీంతో వారు శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. లైంగిక శ‌క్తి కూడా పెరుగుతుంది. వీర్యం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. ఇది సంతానం క‌లిగే అవ‌కాశాల‌ను పెంచుతుంది. అందువ‌ల్ల దొండ‌కాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది.

Admin

Recent Posts