వినోదం

Jr NTR : ప్రాణ స్నేహితుడిని నమ్మి దారుణంగా మోసపోయిన ఎన్టీఆర్.. అతను ఎవరు అంటే..?

Jr NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు పెట్టుకొని ఇండస్ట్రీలో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ళ వయస్సులోనే ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. తారక్ తర్వాత చేయబోయే సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ కి ఎదురైన‌ ఒక చేదు అనుభవం వింటే షాక్ అవుతారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్స్, నిర్మాతలు క్యూ కట్టేవారు.

అయితే అప్పట్లో ఎన్టీఆర్ కి ఎంతో సన్నిహితుడిగా ఉండే ఒక స్నేహితుడు ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దగ్గర ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి నీకు కాల్ షీట్స్ ఇప్పిస్తాను అని చెప్పి అతని దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నాడట.. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ ఆంధ్రావాలా, సాంబ, నరసింహుడు, నా అల్లుడు ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు కానీ మాకు మాత్రం సినిమా చేసి పెట్టడం లేదు అంటూ నేరుగా ఎన్టీఆర్ వద్దకే వెళ్లారట ఆ నిర్మాతలు. మా దగ్గర అంత అడ్వాన్స్ డబ్బులు తీసుకొని మా సినిమా చెయ్యవా.. నిన్ను నమ్మి అప్పు చేసి డబ్బు తెచ్చి అడ్వాన్స్ గా నీకు ఇచ్చాము. వాటికి వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాము. నువ్వు మాత్రం మాకు కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పి ఇవ్వడం లేదు అని ఎన్టీఆర్ ని నిలదీసాడట.

jr ntr cheated by his close friend

అప్పుడు ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్ అయ్యి నేనెప్పుడూ మీకు కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పాను అన్నాడట. అప్పుడు ఆ నిర్మాత నీ స్నేహితుడు నీ కాల్ షీట్స్ ఇస్తాను అని చెప్పి మా దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడు. నువ్వేమో ఏమి తేలినట్టు మాట్లాడుతున్నావ్ అని మండిపడ్డాడట. అప్పుడు ఎన్టీఆర్ ఈ విషయం నాకు తెలీదు మీకు కచ్చితంగా నా నెక్స్ట్ మూవీకి డేట్లు ఇస్తాను అని చెప్పాడట. కానీ ఆ నిర్మాత ఒప్పుకోకపోవడంతో ఎన్టీఆర్ తన దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పోగు చేసి ఆ నిర్మాతకి సెటిల్ చేసి పంపాడట. నమ్మి చేరదీస్తే ఇంత మోసం చేస్తావా అంటూ ఎన్టీఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ ని బాగా మందలించి దూరం పెట్టేసాడట. ఆ వ్యక్తి ఎవరు అన్నది ఎన్టీఆర్ సన్నిహితులకు మాత్రమే తెలుసట.

Admin

Recent Posts