సాధారణంగా ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకుని ఆ ఇంటికి వారికి నచ్చిన రంగులను వేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎవరి అభిరుచికి అనుగుణంగా వారు ముదురు రంగులు వేయడం లేదా లేత రంగులు వేయడం చేస్తుంటారు. అయితే మన ఇంటికి వేసిన రంగుల ప్రభావం కూడా మనపై ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో ఉపయోగించే రంగుల ప్రభావం మనపై ఉండటం వల్ల మనకు మంచి, చెడులు జరుగుతాయని చెప్పవచ్చు.
మరి వాస్తు శాస్త్రం ప్రకారం డైనింగ్ రూమ్ లో ఏ విధమైనటువంటి రంగులు ఉండాలి.. డైనింగ్ రూమ్ లో ఎలాంటి మార్పులు చేయాలి అనే విషయానికి వస్తే.. మన ఇంట్లో అందరికీ ప్రత్యేక గదులు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తాము. డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా మాట్లాడుతూ కలిసి కూర్చుని భోజనం చేస్తాము. కనుక ఇక్కడ మనకు ప్రశాంతమైన వాతావరణం కల్పించే రంగులు ఉండటం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
డైనింగ్ రూమ్ లో ప్రశాంతమైన వాతావరణం కలగాలంటే తప్పనిసరిగా ఆ రూంలో ముదురురంగులు కాకుండా లేత రంగులను వేయడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా లేత ఆకుపచ్చ, లేత గులాబీ రంగు, ఊదా రంగులు వేయటం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పవచ్చు. ఇలాంటి లేత రంగులు వేసుకోవటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఉండవని నిపుణులు తెలియజేస్తున్నారు.