వినోదం

Uday Kiran : చిరంజీవి కూతురితో ఉద‌య్ కిర‌ణ్ బ్రేక‌ప్.. ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత అస‌లేం జ‌రిగింది..!

Uday Kiran : తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ ల‌వ‌ర్ బాయ్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్న హీరో ఉద‌య్ కిర‌ణ్. ఒక‌ప్పుడు ఉద‌య్ కిర‌ణ్ త‌న సినిమాల‌తో చిరంజీవి, వెంక‌టేష్, బాల‌కృష్ణ వంటి హీరోల‌కు కూడా భ‌యం క‌ల్పించాడు. ఆయన చనిపోయి 9 ఏళ్ళు పైనే అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా మిలీనియం మొదట్లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన తారాజువ్వ ఉదయ్ కిరణ్. వరస విజయాలతో అప్పట్లో సంచలనం సృష్టించాడు ఈ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.

ఉదయ్ కిరణ్ న‌టించిన నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు ఈ సినిమాలతో మనోడి క్రేజ్ మ‌రింత‌ పెరిగింది. దాంతో స్టార్ డైరెక్టర్ లు ఉదయ్ కిరణ్ డేట్స్ కోసం క్యూ కట్టారు. ఉద‌య్ కిరణ్ క్రేజ్ చూసి మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మితతో ఎంగేజ్మెంట్ జ‌రిపించాడు ఈ క్ర‌మంలో ఉద‌య్ కిర‌ణ్ తో సినిమా చేసేందుకు ఏకంగా 11 బడా బ్యానర్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న వీరి వివాహం క్యాన్సిల్ అయింది. ఉద‌య్ కిరణ్ బిహేవియ‌ర్ న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే క్యాన్సిల్ అయ్యింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వచ్చాయి.

what happened after break up with susmitha to uday kiran

బ్రేక‌ప్ త‌ర్వాత ఉద‌య్ కిర‌ణ్ తో సినిమాలు ప్రకటించిన బడా బ్యానర్ లు అడ్వాన్స్ లను వెనక్కి తీసుకున్నాయి. ఆఫ‌ర్స్ త‌గ్గాయి. ఇక ఆయ‌న చేసిన సినిమాలు కూడా ఫ్లాపుల బాట ప‌ట్టాయి. అయితే అదే స‌మ‌యంలో ఉద‌య్ కిర‌ణ్ నిషిత అనే సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ను వివాహం చేసుకున్నాడు. వీరి ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో కూడా అనేక వివాదాలు న‌డిచాయి. ఇవ‌న్నీ త‌ట్టుకోలేక ఉద‌య్ కిర‌ణ్ సూసైడ్ చేసుకున్నాడు. ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణాన్ని ఇప్ప‌టికీ ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు.

Admin

Recent Posts