Kabuli Chana : రోజూ ఇవి ఇన్ని తింటే చాలు.. ర‌క్త‌మే ర‌క్తం.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Kabuli Chana : మ‌నం ఆహారంగా కాబూలీ శ‌న‌గ‌లను కూడా తీసుకుంటూ ఉంటాం. కాబూలీ శ‌న‌గ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కాబూలీ శ‌న‌గ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. కాబూలీ శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది శ‌న‌గ‌లు తింటే గ్యాస్ వ‌స్తుంది, చీము ప‌డుతుంది అని అపోహ ప‌డుతూ ఉంటారు. కానీ కాబూలీ శ‌న‌గ‌ల‌ను త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల కాబూలీ శ‌న‌గ‌ల్లో 285 కిలో క్యాల‌రీల శ‌క్తి, 40 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 19 గ్రాముల ప్రోటీన్స్, 5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల ఫైబ‌ర్, 233 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే ఇవి తేలిక‌గా జీర్ణ‌మ‌వుతాయి.

గ్యాస్ ను చాలా త‌క్కువ మోతాదులో విడుద‌ల చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబూలీ శ‌న‌గ‌ల్లో ఉండే ప్రోటీన్, ఫైబ‌ర్ ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా అదుపులో ఉంచుతాయి. వీటిని ప్ర‌తిరోజూ ఒక కప్పు ఉడికించిన కాబూలీ శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే గ్లూకోజ్ 35 శాతం ర‌క్తంలో క‌ల‌కుండా ఉంటుంద‌ని నిపుణులు ప‌రిశోధ‌న‌ల తెలియ‌జేసారు. డ‌యాబెటిస్ వ్యాధి గ్ర‌స్తుల‌కు కాబూలీ శ‌న‌గ‌లు చ‌క్క‌టి ఆహార‌మ‌ని వీటిని త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాబూలీ శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్సులిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డంతో పాటు ఇన్సులిన్ నిరోధ‌కత కూడా త‌గ్గుతుందని వారు చెబుతున్నారు. ఈ శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని కూడా వారు చెబుతున్నారు.

Kabuli Chana benefits in telugu must take them daily
Kabuli Chana

అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉంటుంది. వీటిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బద్ద‌కం స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే కాబూలీ శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వల్ల ప్రేగుల్లో మేలు చేసే బ్యాక్టీరియా ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంద‌ని దీంతో ప్రేగుల్లో రోగనిరోధ‌క వ్య‌వ‌స్థ చ‌క్క‌గా ఉంటుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. కాబూలీ శ‌న‌గ‌ల‌ను నాన‌బెట్టి మిక్సీ పట్టుకుని వాటి నుండి పాల‌ను తీయాలి. ఈ పాల‌ను కాచి తోడు పెడితే పెరుగు త‌యారవుతుంది. ఈ పెరుగును తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వస్థ చ‌క్క‌గా ప‌ని చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా కాబూలీ శ‌న‌గ‌ల్లో మిథియోనిన్ అనే ఆమైనో యాసిడ్ ఉంటుంది. ఇది లివ‌ర్ డిటాక్సిఫికేష‌న్ లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే కాబూలీ శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య తలెత్త‌కుండా ఉంటుంది. ఈ విధంగా కాబూలీ శ‌న‌గ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts