ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి. ఆయన నటించి దర్శకత్వం వహించిన కాంతారా చిత్రం ఊహించని టాక్‌తో దూసుకెళ్లింది. కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోంబలే సంస్థ రూపొందించిన ఈ సినిమా రూపొందించగా, ఈ చిత్రం తొలి రోజు కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనాలు నమోదు చేసింది. ఈ మూవీ మెల్ల మెల్లగా దేశంలోని సినీ అభిమానుల ఆదరణను చూరగొన్నది. ఈ క్రమంలో రిషబ్ శెట్టి పేరు అప్పట్లో ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఇప్పటికీ అతని గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. అయితే రిషబ్ శెట్టి లవ్ స్టోరీ సినిమాని మించే ట్విస్ట్ లతో ఉంది.
రిషబ్ శెట్టి భార్య పేరు ప్రగతి. ఒక సినిమా ఈవెంట్ లో వీరి మధ్య తొలి పరిచయం ఏర్పడింది. రిషబ్ శెట్టి.. రక్షిత్ శెట్టితో అనేక విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. అందులో కిర్రాక్ పార్టీ చిత్రం కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రాల్లో ఒక చిత్రం ఈవెంట్ కి ప్రగతి హాజరైంది. ఆ ఈవెంట్ లో రిషబ్.. ప్రగతిని చూశారు. ఎక్కడో చూసినట్టు ఉందిగా అని ఆలోచిస్తూనే, ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ ఫేస్ బుక్ ఓపెన్ చేశాడు. ఫేస్ బుక్ లో ఏడాది క్రితం ప్రగతి రిషబ్ కి ఫ్రెండ్ రిక్వస్ట్ పంపింది. వెంటనే యాక్సెప్ట్ చేయడం, ఇద్దరి మధ్య మాటలు కలవడం జరిగింది.
ఆ తర్వాత మనసులు కూడా కలిసాయి. అయితే ప్రగతి ఇంట్లో వారు రిషబ్‌ని రిజెక్ట్ చేశారు. సినిమా వాడని వద్దు అని అన్న వారు తర్వాత మెల్లగా ఒప్పుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ప్రగతి ఐటి జాబ్ కూడా మానేసి రిషబ్ కి సపోర్ట్ గా నిలిచింది. సినిమాని మించిన ట్విస్ట్‌లతో వారి లవ్ స్టోరీ ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కాంతారా విషయానికి వస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో దీనికి ప్రీక్వెల్‌ను ప్రస్తుతం రూపొందిస్తున్నారు.