వినోదం

Neelambari : త‌ల్లి చెప్పిన మాట విని నీలాబంబ‌రి పాత్ర‌కు నో చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Neelambari : సినిమాల్లోని కొన్ని పాత్ర‌లు కొంత మందికి ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు తెస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అస‌లు ఆ పాత్ర వారి కోసమే పుట్టిందా అనే అనుమానం క‌లుగుతుంది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రలో రమ్యకృష్ణ తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలానే ర‌జ‌నీకాంత్ న‌టించిన న‌ర‌సింహ చిత్రంలో నీలాంబ‌రి పాత్ర‌కు ర‌మ్య‌కృష్ణ త‌ప్ప మ‌రొక‌రు సూట్ కార‌ని గ‌ట్టిగా చెప్ప‌గ‌లం. నీలాంబ‌రి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించ‌లేదు. జీవించేసింది. ఆమె హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌ని క‌ట్టిప‌డేసాయి. ఆ పాత్ర‌ని వేరొకరు చేసి ఉంటే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యేది కాదు.

రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర కోసం ముందుగా ఆమెను అనుకోలేదట. ముందుగా నీలంబరి పాత్ర కోసం నగ్మా ను సంప్రదించారట దర్శకుడు రవికుమార్.ఇక ఆమెను కలిసి స్టోరీ వినిపించేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు.పాత్ర నచ్చినా డేట్స్ ఖాళీ లేకపోవడంతో చివరికి సినిమా వదులుకున్నారట. అనంత‌రం అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న మీనానా సంప్ర‌దించాడ‌ట ద‌ర్శకుడు. అప్ప‌ట్లో మీనా ఏ పాత్ర చేయాలన్నది ఆమె తల్లి డిసైడ్ చేసేది అయితే మీనాకు పాత్ర నచ్చిన ఆమె తల్లికి నచ్చక పోవడంతో నీలాంబ‌రి పాత్ర‌కు మీనా కూడా దూరం అయింది.

do you know missed to do nilambari role

ఇక ఆ స‌మ‌యంలో ర‌మ్య‌కృష్ణ‌ని అప్రోచ్ కావ‌డం, ఆమె వెంట‌నే ఎస్ చెప్ప‌డం చ‌కాచ‌కా జరిగిపోయాయి. అస‌లు నీలాంబ‌రి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ చూపిన న‌ట విశ్వ‌రూపం చూసి ప్ర‌తి ఒక్క‌రు అవాక్క‌య్యారు. ఆమె త‌ప్ప ఈ పాత్ర‌ల ఎవరిని ఊహించుకోలేం అని అప్ప‌ట్లో అభిమానులు తెగ కామెంట్స్ చేసే వారు. ఏదేమైన ర‌మ్య‌కృష్ణ కెరీర్‌లో ఇదొక బెస్ట్ రోల్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Admin

Recent Posts