వినోదం

Kanti Chuputho Champesta : కత్తితో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా.. అని బాలయ్య చెప్పిన ఫేమస్ డైలాగ్.. ఎక్కడి నుంచి కాపీ కొట్టారో తెలుసా..?

Kanti Chuputho Champesta : టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో ఒకరైన బాల‌య్య త‌న‌దైన శైలిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఆ తర్వాత కూడా అంతకుమించి అనేలా ఫ్యాన్స్ ని మెప్పించడం కోసం కృషి చేస్తున్నారు. ఎందుకంటే వేరే హీరోకి లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాలకృష్ణకు ఉంది. అభిమానులు బాలయ్య సినిమాలలోఎక్కువగా ఇష్టపడేది ఆయన చెప్పే డైలాగులు కోసం. బాల‌య్య సినిమా అంటే డైలాగులు మినిమ‌మ్ ఉండాల్సిందే. ఎంత భారీ డైలాగును ఆయినా బాల‌య్య సింగిల్ టేక్ లో చెప్పేస్తారు. పౌరాణికం కానీ, మాస్ డైలాగ్ గాని ఇలా ఏ డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో ఓకే అయిపోవాల్సిందే.

బాల‌య్య చెప్పే డైలాగుల‌కు థియేట‌ర్స్ డిటిఎస్ మోత మోగిపోతుంటాయి. ముఖ్యంగా బాల‌య్య ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడంటే ఆ సినిమాలో బాంబుల‌ కన్నా డైలాగులే ఎక్కువగా పేలిపోతాయి. బాలయ్య బాబు కెరియర్లో ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్పిన డైలాగుల్లో అభిమానుల‌కు ఫేవ‌రెట్ డైలాగులు ఎన్నో ఉన్నాయి. బాల‌య్య డైలాగుల్లో న‌ర‌సింహ‌నాయుడు సినిమాలో చెప్పిన క‌త్తుల‌తో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ చాలా మంది ఇప్పటికి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ డైలాగ్ ఆయన అభిమానులను అంతగా ఆకట్టుకుంది. నరసింహనాయుడు చిత్రంలో కత్తి కంటే బాల‌య్య కంటికి ఉన్న ప‌వ‌ర్ ను వివ‌రిస్తూ ఆ డైలాగ్ ఉంటుంది.Kanti Chuputho Champesta the story behind this dialogue

ఇదిలా ఉంటే ఈ డైలాగును ఎన్టీఆర్ నిజ‌జీవితంలో చెప్పార‌న్న సంగ‌తి మాత్రం చాలా మందికి తెలియని విషయం. న‌ర‌సింహ‌నాయుడు సినిమాకు మాటల రచయితగా ప‌నిచేసిన ప‌రుచూరి గోపాల కృష్ణ ఈ డైలాగును రాశారు. అంతేకాకుండా ప‌రుచూరి గోపాల‌కృష్ణనే ఎన్టీఆర్ నటించిన నాదేశం చిత్రానికి కూడా రచయితగా పనిచేశారు. నాదేశం సినిమాలో క్లైమాక్స్ లో ఒకే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అయితే నాదేశం ద‌ర్శ‌కుడు బి. బాప్పయ్య మాత్రం మ‌రో ఫైట్ సీన్ పెట్టాల‌ని అనుకున్నార‌ట‌. కానీ ఆ విష‌యం ఎన్టీఆర్ కు చెప్పేంత ధైర్య దర్శకుడికి లేక ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌కు ఆ బాధ్యత అప్ప‌గించారట.

ఒక సందర్భంలో కారులో వెళుతున్న‌ప్పుడు అన్న‌గారూ మీ మాస్ ఇమేజ్ కు తగ్గట్టు మ‌రో ఫైట్ ఉంటే బాగుంటుంద‌ని ప‌రుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ తో చెప్పడం జరిగిందట. దాంతో ఎన్టీఆర్ దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఫైట్ ఉంటే స‌త్య‌నారాయ‌ణ‌తో చెప్పండి అంతే. నేను గ‌ట్టిగా క‌న్నెర్ర‌చేస్తే వాళ్లు గుండె ఆగి చ‌స్తారు అని అన్నారట‌ ఎన్టీఆర్. పరుచూరి గోపాలకృష్ణ ఈ ఘటనను ఇన్స్పిరేషన్ గా తీసుకొని 20 ఏళ్ల తరువాత న‌ర‌సింహ‌నాయుడు సినిమాలో పెట్టార‌ట‌. ఆ డైలాగే నరసింహనాయుడు చిత్రానికి హైలైట్ గా నిలిచింది.

Admin

Recent Posts