Kitchen Cleaning Tips : మనం ఎల్లప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అనేక రకాల చిట్కాలను, స్ప్రేలను వాడుతూ ఉంటాము. ఇలా చేయడం వల్ల వంటగది శుభ్రపడుతుంది. తళతళ మెరుస్తుంది. అయినప్పటికి వంటగది నుండి ఎప్పుడూ దుర్వాసన వస్తూనే ఉంటుంది. వంటగదిలో ఉండే చెత్తడబ్బా నుండి, వంటగదిలో వండే ఘాటు మసాలా కూరల నుండి వాసన వస్తూనే ఉంటుంది. నాన్ వెజ్ వండిన రోజూ ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలా వాసన రాకుండా ఉండాలంటే మనం కొన్ని రకాల చిట్కాలను వాడాల్సి ఉంటుంది.
ఈ చిట్కాలను వాడడం వల్ల వంటగది నుండి ఘాటు వాసన రాకుండా ఉంటుంది. వంగటది నుండి దుర్వాసనలు, ఘాటు వాసనలు రాకుండా నిరోధించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంటగది నుండి వాసన రాకుండా చేయడంతో పాటు వంటగదిని శుభ్రంగా ఉంచడంలో బేకింగ్ సోడా మనకు ఎంతో సహాయపడుతుంది. దీని కోసం ఒక గిన్నెలో బేకింగ్ సోడాను ఉంచి గదిలో ఒక మూలన ఉంచాలి. ఇలా చేయడం వల్ల వంటగది నుండి వాసన రాకుండా ఉంటుంది. ఇందులో బేకింగ్ సోడాకు బదులుగా వెనిగర్ ను కూడా ఉంచవచ్చు.
అలాగే ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి కలపాలి. తరువాత ఈ నీటితో కిచెన్ ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వంటగది శుభ్రపడడంతో పాటు వాసన కూడా రాకుండా ఉంటుంది. అలాగే ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క ముక్కలు, నిమ్మ లేదా నారింజ తొక్కలు వేసి ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల వంటగదిలో చక్కటి వాసన వస్తుంది. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల వంటగది నుండి చక్కటి వాసన వస్తుంది. రూమ్ స్ప్రేలు వంటివి నచ్చని వారు ఈ చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.