Coconut Halwa : కొబ్బ‌రి హ‌ల్వాను ఇలా చేయండి.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Coconut Halwa : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రితో ర‌క‌రకాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌చ్చి కొబ్బ‌రి హల్వా కూడా ఒక‌టి. బెల్లం, ప‌చ్చి కొబ్బ‌రి క‌లిపి చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు లేదా నైవేథ్యంగా ఈ హ‌ల్వాను త‌యారు చేసి పెట్ట‌వ‌చ్చు. అర‌గంట‌లో ఈ హ‌ల్వాను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ ప‌చ్చి కొబ్బ‌రి హ‌ల్వాను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కొకోన‌ట్ హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి తురుము – 2 క‌ప్పులు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, జీడిప‌ప్పు – కొద్దిగా.

Coconut Halwa recipe in telugu very healthy and tasty
Coconut Halwa

కొకోన‌ట్ హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో కొబ్బ‌రి తురుము, బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. తరువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించాలి. జీడిప‌ప్పు వేగిన త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత అదే నెయ్యిలో మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి తురుము వేసి ఉడికించాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. ఇలా 20 నిమిషాల‌కు పైగా ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి, జీడిప‌ప్పు, మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొకోన‌ట్ హ‌ల్వా త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ప‌చ్చి కొబ్బ‌రితో రుచిక‌ర‌మైన ఆరోగ్యక‌ర‌మైన హ‌ల్వాను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts