Sorakaya Juice Benefits : ఆరోగ్యానికి సొరకాయ చాలా మేలు చేస్తుంది. చాలా మంది, సొరకాయని రెగ్యులర్ గా వంటల్లో వాడుతూ ఉంటారు. కొంతమంది ఖాళీ కడుపుతో, సొరకాయ జ్యూస్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. చాలా మందికి సొరకాయ జ్యూస్ ని, ఖాళీ కడుపుతో తీసుకుంటే, ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయం తెలీదు. నిజానికి సొరకాయలో విటమిన్స్, మినరల్స్ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు ఇందులో బాగా తక్కువ ఉంటాయి. ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, సొరకాయ రసం బాగా పనిచేస్తుంది. అజీర్తి సమస్యల్ని కూడా ఇది పోగొడుతుంది. హైడ్రేట్ గా మారుస్తుంది. ఖాళీ కడుపుతో సొరకాయ రసం తీసుకోవడం వలన, ఎటువంటి లాభాలని పొందవచ్చు..?, ఏఏ సమస్యలకి దూరంగా ఉండవచ్చు అనే విషయానికి వచ్చేస్తే… సొరకాయ రసాన్ని తీసుకోవడం వలన, మలబద్ధకం సమస్య నుండి బయటపడొచ్చు. గ్యాస్, ఫైల్స్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
చాలామంది అజీర్తి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు, సొరకాయ రసాన్ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సొరకాయ రసాన్ని తీసుకోవడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు సొరకాయ జ్యూస్ ని తీసుకోవడం వలన, డయాబెటిస్ ప్రమాదం నుండి బయటపడొచ్చు. సొరకాయలో విటమిన్స్, పొటాషియం ఉంటాయి.
అలానే, ఇందులో ఉండే ఫైబర్, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. సొరకాయ రసాన్ని తాగడం వలన గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. కార్డియో వాస్కులర్ సమస్యలు కూడా వుండవు. బీపీ కూడా తగ్గుతుంది. సొరకాయ తీసుకోవడం వలన ఇంఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. ఇక సొరకాయ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే… సొరకాయని చిన్న ముక్కలు కింద కట్ చేసి, పుదీనా వేసి బాగా మిక్సీ పట్టాలి. వడ కట్టేసుకుని ఇందులో నిమ్మరసం, ఉప్పు వేసుకుని తీసుకుంటే సరిపోతుంది.