Kothimeera Pappu : కొత్తిమీర ప‌ప్పును ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Kothimeera Pappu : మ‌నం వంట్ల‌లో గార్నిష్ కోస‌మే కొత్తిమీర‌ను వాడుతూ ఉంటాము. కానీ కొత్తిమీర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వంటల్లో గార్నిష్ కోసం వాడ‌డంతో పాటు కొత్తిమీర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌ప్పును ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. కొత్తిమీర‌తో ప‌ప్పును త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇత‌ర ఆకుకూర‌ల‌తో చేసిన‌ట్టుగానే ఈ ప‌ప్పును మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే కొత్తిమీర ప‌ప్పు త‌యారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తిమీర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక గ్లాస్, నీళ్లు – 3 క‌ప్పులు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 8, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – ఒక క‌ప్పు, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌.

Kothimeera Pappu recipe in telugu make in this way
Kothimeera Pappu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఎండుమిర్చి – 1.

కొత్తిమీర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో ప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టాలి. ప‌ప్పు నానిన త‌రువాత ఇందులో కొత్తిమీర‌, నిమ్మ‌ర‌సం త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మూత తీసి కుక్క‌ర్ ను మ‌ర‌లా స్ట‌వ్ మీద ఉంచి ఉడికించాలి. ప‌ప్పు గట్టిగా ఉంటే త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత కొత్తిమీర వేసి క‌లపాలి. దీనిని ఒక నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పు కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత తాళింపు ప‌దార్థాలను ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర ప‌ప్పు త‌యార‌వుతుంది. అన్నం, చ‌పాతీ, రోటీ వంటి వాటిలోకి ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts