Sweet Pulagam : స్వీట్ పులగం… తియ్యగా, రుచిగా ఎంతో కమ్మగా ఉండే ఈ పులగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దీనిని అమ్మమ్మల కాలంలో ఎక్కువగా తయారు చేసి తీసుకునే వారు. బొబ్బరపప్పుతో చేసే ఈ పులగాన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కూరకూరలు తిని తిని బోర్ కొట్టిన వారు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా స్వీట్ పులగాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ స్వీట్ పులగాన్నిఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్వీట్ పులగం తయారీకి కావల్సిన పదార్థాలు..
బొబ్బర పప్పు – ఒక గ్లాస్, బియ్యం – ఒక గ్లాస్, నీళ్లు – 5గ్లాసులు, ఉప్పు – తగినంత.
స్వీట్ పులగం తయారీ విధానం..
ముందుగా కళాయిలో బొబ్బర పప్పును వేసి వేయించాలి. దీనిని దోరగా వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత 5 గ్లాసుల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి ఉప్పు వేసి కలపాలి. అన్నం ఉడుకు పట్టిన తరువాత మూత పెట్టి చిన్న మంటపై మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పులగాన్ని ప్లేట్ లోకి తీసుకుని నెయ్యి వేసుకోవాలి. తరువాత బెల్లంతో కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ పులగం తయారవుతుంది. బెల్లం ఇష్టంలేని వారు కూరలతో కూడా ఈ పులగాన్ని తినవచ్చు. ఈ విధంగా స్వీట్ పులగాన్ని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందవచ్చు. వెరైటీ రుచులను ట్రై చేయాలనుకునే వారు ఇలా స్వీట్ పులగాన్ని తయారు చేసుకుని తినవచ్చు.