Krithi Shetty : తమిళ స్టార్ నటుడు విజయ్, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు నటిస్తున్న చిత్రం.. బీస్ట్. ఈ మూవీ ఇటీవలి కాలంలో చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా ఇందులోని అరబిక్ కుతు అనే పాట హిట్‌కావడంతో నెటిజన్లు ఆ పాటను ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఇక ఈ పాటకు ఇప్పటికే పలువురు హీరోయిన్స్ స్టెప్పులు వేశారు. సమంత, రష్మిక మందన్న, కీర్తి సురేష్ లు ఈ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. వీరి జాబితాలో బేబమ్మ కృతి శెట్టి కూడా చేరిపోయింది.
కృతిశెట్టి అరబిత్ కుతు పాటకు తాజాగా స్టెప్పులు వేసింది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాట స్టైల్‌కు తగినట్లుగా కృతిశెట్టి డ్యాన్స్ చేసి అలరించింది.
ఇక ఈమె ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్‌తో ది వారియర్, నితిన్‌తో మాచెర్ల నియోజకవర్గం వంటి సినిమాల్లో ఈమె నటిస్తోంది. ఈ మూవీలు ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్నాయి.