Krithi Shetty : యంగ్ హీరోయిన్ కృతిశెట్టి ప్రస్తుతం పలు వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఉప్పెన అందించిన ఊపుతో ఈ అమ్మడికి పలు అవకాశాలు క్యూ కట్టాయి. తరువాత ఈమె వరుసగా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలనే సాధించాయి. దీంతో కృతిశెట్టి కావల్సిన బూస్టింగ్ లభించింది. ఈ క్రమంలో ఈమె వెనుదిరిగి చూడడం లేదు. అనేక సినిమాల్లో ఈమెకు చాన్స్‌లు వస్తున్నాయి. దీంతో ఈమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో కృతిశెట్టిపై పలు సైట్లలో కథనాలు వచ్చాయి. ఆమె సినిమా షూటింగ్ లొకేషన్‌కు టైముకు రావడం లేదని, 3, 4 గంటలు ఆలస్యంగా వస్తుందని.. వచ్చినా దర్శక నిర్మాతలను ముప్పు తిప్పలు పెడుతుందని.. అలాగే భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తుందని.. కొన్ని కథనాలు వచ్చాయి. దీంతో ఈ కథనాలపై కృతిశెట్టి మనస్థాపం చెందిందట. అందులో భాగంగానే ఆమె తన మేనేజర్‌తో కొన్ని పీఆర్ టీమ్‌లతో మాట్లాడించాలని చూసిందట.
అయితే ఇలాంటి పుకార్లు అనేవి హీరోయిన్స్‌పై సహజంగానే వస్తుంటాయి.. కొన్ని రోజులు ఆగితే అవే సద్దుమణిగిపోతాయి.. కనుక వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆమె మేనేజర్‌లు ఆమెకు నచ్చజెప్పారట. ఈ క్రమంలోనే కృతి శెట్టి కాస్తంత శాంతించిందని సమాచారం. ఇక ఈమె ప్రస్తుతం.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ది వారియర్.. మాచెర్ల నియోజకవర్గం తదితర సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.