Samsung Galaxy Tab S8 : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్.. గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్‌లో కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లను భారత్‌లో విడుదల చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్8, ఎస్8 ప్లస్, ఎస్8 అల్ట్రా పేరిట మూడు ట్యాబ్లెట్లను లాంచ్ చేసింది. వీటిల్లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు.
ఈ ట్యాబ్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ లభిస్తుంది. అందువల్ల అత్యుత్తమ పెర్ఫార్మెన్స్‌ను పొందవచ్చు. ఇక ఈ ట్యాబ్‌లలో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ట్యాబ్ ఎస్8 లో 11 ఇంచులు, ఎస్8 ప్లస్‌లో 12.7 ఇంచులు, ఎస్8 అల్ట్రాలో 14.6 ఇంచుల డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. అన్నింటికీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే లభిస్తుంది. ఇవి 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో విడుదలయ్యాయి. మెమొరీని కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.
వెనుక వైపు 13, 6, ముందు వైపు 12, 12 మెగాపిక్సల్ కెమెరాలు ఉన్నాయి. ఎస్8 ట్యాబ్‌లో ఫింగర్ ప్రింట్ పక్కన ఉంది. మిగిలిన రెండింటిలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మోస్, ఎస్ పెన్ విత్ బ్లూటూత్, 5జి, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి వంటి ఫీచర్లు లభిస్తున్నాయి. అలాగే ట్యాబ్ ఎస్8లో 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ట్యాబ్ ఎస్8 ప్లస్ లో 10,090 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ట్యాబ్ ఎస్8 అల్ట్రాలో 11,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వీటికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
ఈ ట్యాబ్‌ల ధరలు ఇలా ఉన్నాయి.
Samsung Galaxy Tab S8 Wi-Fi 8GB + 128 GB – రూ.58,999
Samsung Galaxy Tab S8 5G 8GB + 128 GB – రూ.70,999
Samsung Galaxy Tab S8+ Wi-Fi 8GB + 128 GB – రూ.74,999
Samsung Galaxy Tab S8+ 5G 8GB + 128 GB – రూ.87,999
Samsung Galaxy Tab S8 Ultra Wi-Fi 12GB+256GB – రూ.1,08,999
Samsung Galaxy Tab S8 Ultra 5G 12GB+256GB – రూ.1,22,999
గెలాక్సీ ట్యాబ్ ఎస్8 సిరీస్ ట్యాబ్‌లు మార్చి 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటికి ఇప్పికే ప్రీ ఆర్డర్లను ప్రారంభించారు. ఇక లాంచింగ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో రూ.7000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.