ఆధ్యాత్మికం

వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి ఎందుకు తొక్కిస్తారో తెలుసా ?

సాధారణంగా మనం ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ముందుగా ఆ వాహనానికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొత్త వాహనాలను ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పూజలు చేయించి వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి ముందుగా నిమ్మకాయలను తొక్కిస్తారు. అయితే ఈ విధంగా నిమ్మకాయలను ఎందుకు తొక్కిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి తొక్కించడం పూర్వకాలం నుంచి ఒక ఆచారంగా వస్తోంది. పూర్వకాలంలో ఎడ్లబండ్ల కింద నిమ్మకాయలు పెట్టేవారు. ఏదైనా శుభకార్యాల నిమిత్తం బయలుదేరినప్పుడు లేదా కొత్త వాహనాలను కొనుగోలు చేసినప్పుడు ఈ విధంగా వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి తొక్కిస్తారు. ప్రయాణించే మార్గంలో వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసమే ఇలా నిమ్మకాయలను తొక్కిస్తారు.

lemon under tires what is the meaning of it

పూర్వ కాలంలో ఎడ్లబండ్లు మాత్రమే ఉండేవి కనుక ఎంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో ఎడ్ల కాళ్లకు ఏవైనా గాయాలు తగిలితే ఆ గాయాలు మానడం కోసం నిమ్మకాయలను తొక్కించే వారు. నిమ్మకాయ పులుపు ఉండటంవల్ల ఏదైనా ఇన్ఫెక్షన్‌ని తొందరగా తగ్గిస్తుందన్న ఉద్దేశంతో ఎడ్ల బండ్ల కింద నిమ్మకాయలను తొక్కించే వారు. అదే ఆనవాయితీ ఇప్పుడు ఏదైనా వాహనాలను కొనుగోలు చేసినా మొదటగా ఆ వాహనానికి దిష్టి తీసి నిమ్మకాయలను తొక్కిస్తారు. ఇలా చేయడం వల్ల వాహనం ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటుందని విశ్వసిస్తారు.

Admin

Recent Posts