ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇది విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ 16 ఏళ్ల యువకుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అయితే ఈ యువకుడు ఫోర్నోగ్రఫీ డీలర్. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం ఇతనిని అరెస్ట్ చేశారు. నాలుగు వేల చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను అమ్మడం ద్వారా ఎంతో సంపాదించాడు. అంతేకాక 30% కమిషన్ ను పొందుతూ డీలర్ గా వ్యవహరిస్తున్నాడు.
పైగా ఈ వీడియో సప్లయర్ పేరును రాజ్ గా టెలిగ్రామ్ లో పెట్టుకున్నాడు అని తెలిసింది. ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ గోరఖ్పూర్ సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలియజేశారు. దీంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి అతని మొబైల్ ఫోన్ ను సీజ్ చేసి వెంటనే అరెస్ట్ చేశారు. వీటికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ మైనర్ అబ్బాయి కి సంబంధిత క్రిమినల్ లాస్ మరియు సెక్షన్లతో కేస్ ఫైల్ చేశారు.
అంతేకాక ఇలా చేస్తున్న వారందరి పై సైబర్ పోలీసులు యాక్షన్ తీసుకుంటామని అటువంటి నెట్వర్క్ ఉండకూడదని తెలియజేశారు. అయితే ఈ మైనర్ అబ్బాయి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా క్లైంట్ వద్ద ఒక వీడియోకు 3000 రూపాయలు తీసుకుంటాడని తెలిసింది. పైగా ఈ చార్జెస్ 20,000 వరకు ఉంటాయని, పేమెంట్ వచ్చిన తర్వాతే ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని తేలింది.