ఆధ్యాత్మికం

Thamalapaku Deepam : త‌మ‌ల‌పాకుపై ఇలా దీపం వెలిగించండి.. అనుకున్న‌వి నెర‌వేరుతాయి..!

Thamalapaku Deepam : కచ్చితంగా ప్రతి పూజకి మనం తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాం. తమలపాకు లేకుండా పూజ పూర్తి కాదు. అయితే నిజానికి తమలపాకు వలన ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు తమలపాకు మీద దీపాన్ని వెలిగిస్తే చక్కటి ప్రయోజనాలను మనం పొందవచ్చు. తమలపాకు కాడలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. తమలపాకు చివర లక్ష్మీ దేవి ఉంటుంది. తమలపాకు మధ్యలో సరస్వతీ దేవి ఉంటుంది.

తమలపాకు మీద దీపాన్ని వెలిగిస్తే అనుకున్న పనులు పూర్తి అవుతాయట. మరి ఇక తమలపాకుపై దీపాన్ని వెలిగించడం గురించి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే ముఖ్య విషయాలను తెలుసుకుందాం. మీరు తమలపాకు మీద దీపాన్ని వెలిగిస్తే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీకు ఇక అపజయమే ఉండదు. అయితే మీరు ఇలా దీపం పెట్టాలంటే అందుకోసం తమలపాకులపై కాడని తుంచుకోవాలి. అలా ఆరు ఆకుల్ని తుంచుకోండి.

lit deepam on thamalapaku like this

పూజ గదికి ముందు ఒక టేబుల్ మీద ఈ ఆకుల్ని నెమలి పింఛంలా పెట్టుకోవాలి. దానిపై మట్టి ప్రమిదని ఉంచి తుంచేసిన కాడలన్నింటినీ మట్టి ప్రమిద‌లోనే వేసి నువ్వుల నూనె వేసి దీపం పెట్టాలి. ఇలా ఈ విధంగా మీరు దీపం పెట్టడం వలన అనుకున్న పనులు పూర్తవుతాయి. తమలపాకులో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు. కాబట్టి చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. అనుకున్నవి పూర్తవుతాయి. మీకు ఎటువంటి లోటు కూడా ఉండదు. సుఖ సంతోషాలతో మీరు హాయిగా ఉండొచ్చు. అయితే దీపం పెట్టేటప్పుడు ఇక్కడ చెప్పింది చెప్పినట్లు చేస్తే కచ్చితంగా ఫలితం కనిపిస్తుంది. కావాలంటే ఈసారి ఈ విధంగా దీపం పెట్టి చూడండి.

Admin

Recent Posts