technology

ఐఫోన్ 15 ప్ల‌స్‌ను ఫ్లిప్ కార్ట్‌లో రూ.27వేల‌కే కొన‌వ‌చ్చు..!

మీరు యాపిల్‌కు చెందిన ఐఫోన్ 15 మోడ‌ల్ ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్నారా. అయితే ఈ ఆఫ‌ర్ మీకోస‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఐఫోన్ 15 ప్ల‌స్ ఫోన్ ను మీరు ఇప్పుడు చాలా త‌గ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. కేవ‌లం రూ.27,949 కే ఐఫోన్ 15 ప్ల‌స్ ఫోన్‌ను మీరు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్యాంక్ డిస్కౌంట్ల‌తోపాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ల‌ను కూడా క‌లిపితే ఈ డీల్ మీకు సొంత‌మ‌వుతుంది. ఐఫోన్ 15 ప్ల‌స్‌కు చెందిన 128 జీబీ మోడ‌ల్‌ను ఇలా కొన‌వ‌చ్చు. భారీ ధ‌ర‌కు ఇప్పుడు ఈ ఫోన్‌ను ఎలా కొనవ‌చ్చో చూద్దాం.

ఫ్లిప్ కార్ట్‌లో ప్ర‌స్తుతం ఐఫోన్ 15 ప్ల‌స్‌కు చెందిన 128 జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.66,999గా ఉంది. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు రూ.3000 త‌గ్గింపు ధ‌ర‌ను అందిస్తున్నారు. దీంతో ధ‌ర రూ.63,999 అవుతుంది. అదేవిధంగా ఏదైనా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.30,050 వ‌ర‌కు డిస్కౌంట్ ఇస్తారు. దీంతో ఫోన్ ధ‌ర రూ.27,949 అవుతుంది. ఇలా ఐఫోన్ 15 ప్ల‌స్‌ను చాలా త‌క్కువ ధ‌ర‌కే సొంతం చేసుకోవ‌చ్చు.

now you can get iphone 15 plus at discounted price on flipkart

ఇక ఐఫోన్ 15 ప్ల‌స్ ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. ఇందులో 6.7 ఇంచుల సూప‌ర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంది. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ల‌భిస్తుంది. ఇందులో ఎ16 బ‌యానిక్ చిప్ ల‌భిస్తోంది. వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. బ్యాట‌రీ లైఫ్ కూడా ఇందులో బాగా వ‌స్తుంది. క‌నుక ఈ ఫోన్‌ను కొనాల‌ని అనుకుంటే వెంట‌నే కొనేయండి. మ‌ళ్లీ ఇలాంటి డిస్కౌంట్ రాక‌పోవ‌చ్చు.

Admin

Recent Posts