Lord Ganesha : వినాయకుడిని ఆరాధిస్తే, ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. వినాయకుడిని ఆరాధిస్తే, విఘ్నాలు ఏమి లేకుండా, మన పనుల్ని మనం పూర్తి చేసుకోవచ్చు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, వినాయకుడికి కూడా విష్ణుమూర్తి లానే కొన్ని అవతారాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో భక్తులను రక్షించడానికి, విఘ్నేశ్వరుడు దాదాపు 8 అవతారాలు ఎత్తినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
మాత్యర్యాసురుడు, మదాసురుడు, మోహసురుడు వంటి రాక్షసులను జయించడానికి వక్రతుడు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికతుడు, విఘ్నరాజు అనే అవతారాలను వినాయకుడు ఎత్తాడు. ఆ అవతారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుడిని సృష్టించడం జరిగింది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించగా ఎన్నో శక్తులు వచ్చాయి. దేవతలంతా భయపడిపోయారు. సనత్ కుమారుని వద్దకు వెళ్లి ఉపాయం అడగగా సనత్ కుమారుని సూచన మేరకు వినాయకుడిని ప్రార్థించగా ఆయన ఏకదంతునిగా అవతరించి మదాసురుడిని జయించాడు.
ఇంద్రుడు చేసిన తప్పు వలన మాత్సర్యాసురుడు పుడతాడు. అతని బాధలని భరించలేక దేవతలంతా దత్తాత్రేయుని శరణు కోరగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించమని చెప్తాడు. అప్పుడు వినాయకుడు వక్రతుండునిగా అవతరించాడు. అలానే, కుబేరుడి ఆశ నుండి లోభాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. చివరికి వినాయకుడిని ప్రార్ధించి లోభాసురుడి నుండి విముక్తి కల్పించమనగా గజాననుడిగా అవతరించి లోభాసురుడిని ఓడిస్తాడు వినాయకుడు.
అలానే, మోహాసురుడు అనే రాక్షసుడిని ఓడించడానికి వినాయకుడు మహోదరుడిగా పుట్టాడు. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మోహాసురుడు ముల్లోకాలను పీడించాడు. అప్పుడు దేవతలు వినాయకుడిని ప్రార్ధించారు. అప్పుడు, విఘ్నరాజు అవతారంలో నాగుపాముని వాహనం చేసుకుని సంహరించాడు. అలానే, అహంకరాసురుడిని సంహరించడానికి, వినాయకుడు దూమ్రావర్ణుడు అనే అవతారాన్ని ఎత్తాడు. ఇలా వినాయకుడు కూడా విష్ణు మూర్తి లానే అవతారాలు ఎత్తాడు.