Bedroom : బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేసుకుంటే.. భార్యాభ‌ర్త‌లు ఎప్ప‌టికీ అన్యోన్యంగా ఉంటారు..!

Bedroom : ఇళ్లు చూస్తే ఎటువంటి వాస్తు దోషం ఉండ‌దు. కానీ ఆ ఇంట్లోని భార్యాభ‌ర్తల మ‌ధ్య స‌మ‌స్య‌లు వ‌స్తూ ఉంటాయి. ఇద్ద‌రూ త‌ర‌చూ గొడ‌వ‌లు ప‌డ‌డం, ఒక‌రి మీద ఒక‌రు అరుచుకోవ‌డం, మ‌న‌శాంతి లేక‌పోవ‌డం, అకార‌ణ చికాకులు, అనారోగ్యాల‌కు గురి కావ‌డం, ఇద్ద‌రి మ‌ధ్య శృంగార‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రావ‌డం ఇలా ఏదో ఒక‌టి జ‌రుగుతూ ఉంటుంది. ఇంత‌కు ముందు ఉన్న ఇంట్లో బాగానే ఉన్నాం క‌దా కానీ ఈ ఇంట్లోకి వ‌చ్చాక ఇలా జ‌రుగుతుంది అనే అనుమాన‌మే రాదు. ఎందుకంటే మిగ‌తావ‌న్ని బాగానే ఉంటాయి. కేవ‌లం బెడ్ రూమ్ లోనే స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. వీటికి అనేక కార‌ణాలు ఉంటాయి. ముఖ్యంగా వాస్తు నిపుణులు చెప్పేది ఏమిటంటే బెడ్ రూమ్ యొక్క వాస్తు బాగున్న‌ప్ప‌టికి ఆ గ‌దిలో ఉంచే వ‌స్తువుల వ‌ల్ల దాంప‌త్య స‌మ‌స్య‌లు ఎదురయ్యే అవ‌కాశం ఉంద‌ట‌. వాటిలో ముఖ్యంగా చెప్పేది వాట‌ర్ పెయింటింగ్స్.

వాట‌ర్ పెయింటింగ్స్ ఉన్న బెడ్ రూమ్ లో భార్యాభ‌ర్తలు శృంగారంలో ఆస‌క్తి చూపించ‌ర‌ట‌. క‌నుక వాట‌ర్ పెయింటింగ్స్ ను వెంట‌నే ఇంట్లో నుండి తీసివేయాలి. భార్యాభ‌ర్త‌ల జీవితం సాఫీగా సాగాలంటే హార్ట్ షేప్ వ‌స్తువుల‌ను నైరుతి దిశ‌లో ఉంచుకోవాల‌ట‌. దీని వ‌ల్ల వారి జీవితం హాయిగా ఉంటుంది. అలాగే ఇద్ద‌రికి ఒక‌రి మీద ఒక‌రికి ఆస‌క్తి ఉండాలంటే ఒక అంద‌మైన గిన్నెలో ఫ్యూర్ క్రిస్ట‌ల్స్ ను బియ్యం వేసి పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పెరుగుతుంది. క్రిస్ట‌ల్ ల్యాంప్స్, రెడ్ క‌ల‌ర్ బ‌ల్బుల‌ను బెడ్ రూమ్ లో నైరుతి వైపు ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది.

make changes in Bedroom for happy life according to vastu
Bedroom

అలాగే రెడ్ క‌ల‌ర్ ప‌ర‌దాలు, కుష‌న్స్ ఉప‌యోగిస్తే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పెరుగుతుంది. రెడ్ క‌ల‌ర్ మ‌రీ నిండుగా ఉంటుంద‌ని భావిస్తే పింక్ క‌ల‌ర్ ను ఉప‌యోగించిన ఇద్ద‌రి మ‌ధ్య బాంధ‌వ్యం చాలా అన్యోన్యంగా ఉంటుంది. అలాగే సెరామిక్ బౌల్స్ ను నైరుతి దిశ‌గా బెడ్ రూమ్ లో ఉంచుకోవాలి. ఇలా పెట్టుకోవ‌డం వ‌ల్ల వారి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆ గిన్నెలో చిన్న స్టోన్స్ లేదా క్రిస్ట‌ల్స్ ను పెట్టుకోవ‌చ్చు. అలాగే రెడ్ క‌ల‌ర్ క్యాండిల్స్ ను పెట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

ఎల్ల‌ప్పుడూ బెడ్ రూమ్ ను శుభ్రంగా, అందంగా ఉంచుకోవాలి. బెడ్ ప‌క్క‌న ఉండే టేబుల్ మీద అన్నీ వ‌స్తువుల‌ను చింద‌రవంద‌ర‌గా ప‌డేయ‌కూడదు. అలాగే దుమ్ము ప‌ట్టి ఉండ‌కూడదు. ఇలా చేయ‌డం వ‌ల్ల భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఎటువంటి గొడ‌వ‌లు రాకుండా వారి జీవితం ఆనంద‌మ‌యంగా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts