Aloo Gobi Masala : గోబీ ఆలూ మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేస్తే.. రోటీల‌ను మొత్తం తినేస్తారు..

Aloo Gobi Masala : మ‌నం బంగాళాదుంప‌తో వివిధ ర‌కాల కూర‌గాయ‌ల‌ను క‌లిపి కూర‌లు త‌యారు చేస్తూ ఉంటాం. ఈ విధంగా బంగాళాదుంప‌తో చేసుకోద‌గిన కూర‌ల్లో గోబి ఆలూ మ‌సాలా కూర ఒక‌టి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. క్యాట‌రింగ్ వాళ్లు, క‌ర్రీ పాయింట్ వాళ్లు ఈ కూర‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. క్యాట‌రింగ్ వాళ్లు చేసే విధంగా ఈ కూర‌ను మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాట‌రింగ్ లో ల‌భించే విధంగా ఈ గోబి ఆలూ మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోబి ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు – ఒక క‌ప్పు, త‌రిగిన బంగాళాదుంప ముక్క‌లు – ఒక క‌ప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 2, యాలకులు – 2, స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ట‌మాట ప్యూరీ – 1/3 క‌ప్పు, నీళ్లు – ముప్పావు క‌ప్పు, క‌సూరి మెంతి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా పొడి – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Gobi Masala make in this way perfect taste for rotis
Aloo Gobi Masala

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, క‌ర్బూజ గింజ‌లు – అర టీ స్పూన్, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – ఒక టీ స్పూన్, గ‌స‌గ‌సాలు – ఒక టీ స్పూన్.

గోబి ఆలూ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి కొద్దిగా వేయించాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌ల‌ను, పావు టీ స్పూన్ ప‌సుపును వేసి ముక్క‌లను 50 శాతం ఉడికే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ఉప్పు, ప‌సుపు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి వేయించాలి.

త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్ ను వేసి బాగా వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత వేయించి పెట్టుకున్న ముక్క‌ల‌ను వేసి క‌లిపి మూత పెట్టి ఉడికించాలి. ఈ ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత క‌సూరి మెంతి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే గోబి ఆలూ మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts