Potato Fry : ఆలు ఫ్రై ఇలా చేస్తే.. చాలా రుచిగా ఉంటుంది.. కాస్త ఎక్కువే తింటారు..!

Potato Fry : మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగించే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప ఒక‌టి. బంగాళాదుంప‌ను మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. బంగాళాదుంప‌ల‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి6 ల‌తోపాటు కాప‌ర్‌, మెగ్నీషియం వంటి మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంలో ఇవి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి.

make Potato Fry in this way for perfect taste
Potato Fry

హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌ వంటివి రాకుండా చేయ‌డంతోపాటు కాలేయాన్ని శుభ్ర‌ప‌రిచే గుణం కూడా బంగాళాదుంప‌ల‌కు ఉంది. బంగాళాదుంప‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మూత్ర పిండాల‌లో రాళ్లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బంగాళాదుంప‌ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళదుంప‌ల‌తో త‌యారు చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వివిధ ర‌కాలుగా మ‌నం బంగాళదుంపల‌ను వండి తింటుంటాం. అయితే ఆలుగ‌డ్డ‌ల‌ను ఫ్రై చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. కానీ దీన్ని భిన్నంగా చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే బంగాళదుంపల‌ ఫ్రై ని రుచిగా ఎలా త‌యారుచేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించి ముక్క‌లుగా చేసిన బంగాళాదుంపలు – 300 గ్రా., చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 5, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టేబుల్ స్పూన్, మిరియాలు – 15, గ‌రం మ‌సాలా – అర టేబుల్ స్పూన్, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు- 10, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి స‌రిప‌డా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

ఆలూ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో మిన‌ప ప‌ప్పు, శ‌న‌గ ప‌ప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక త‌రిగిన ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి.

త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. త‌రువాత బంగాళా దుంప ముక్క‌లను వేసి క‌లిపి, మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ముందుగా చేసి పెట్టుకున్న పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌లిపి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి స్ట‌వ్‌ను ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఫ్రై త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో కానీ.. చ‌పాతీ, రోటీ, పుల్కా, దోశ వంటి వాటిలో కానీ క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

D

Recent Posts