Sweet Corn Dosa : స్వీట్ కార్న్ దోశ‌.. ఇలా చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది..!

Sweet Corn Dosa : రోజూ ఉద‌యం మ‌నం అనేక ర‌కాల బ్రేక్‌ఫాస్ట్‌ల‌ను తింటుంటాం. కొంద‌రు దోశ‌ల‌ను త‌ర‌చూ తింటారు. కొంద‌రు ఇడ్లీలు అంటే ఇష్ట ప‌డ‌తారు. అయితే రోజూ ఏదో ఒక‌ర‌మైన వెరైటీకి చెందిన బ్రేక్ ఫాస్ట్‌ను త‌యారు చేసి తింటుంటారు. ఈ క్ర‌మంలోనే కాస్త వెరైటీగా చేసుకుని కూడా ఉద‌యం అల్పాహారం తీసుకోవ‌చ్చు. అలాంటి వాటిలో స్వీట్ కార్న్ దోశ ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే కానీ.. రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే స్వీట్ కార్న్ దోశ‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వీట్ కార్న్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, స్వీట్ కార్న్ – ఒక క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌, ప‌చ్చి మిర్చి – 2, ఉప్పు – తగినంత‌, నూనె – అర క‌ప్పు.

make Sweet Corn Dosa in this way very good taste
Sweet Corn Dosa

స్వీట్ కార్న్ దోశ త‌యారీ విధానం..

బియ్యాన్ని మూడు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత మిక్సీలో వేసి అందులో నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నింటినీ వేసి బాగా క‌లిపి మెత్త‌గా పిండి ప‌ట్టుకోవాలి. ఈ పిండిని నాన‌బెట్టాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు స్ట‌వ్ మీద పెనం ఉంచి వేడ‌య్యాక కాస్త నూనె వేయాలి. అనంత‌రం నూనె వేడయ్యాక పెనంపై పిండిని దోశ‌లా వేయాలి. దాన్ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అనంత‌రం ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా పిండి అంత‌టినీ దోశ‌లుగా కాల్చాలి. దీంతో స్వీట్ కార్న్ దోశ‌లు త‌యార‌వుతాయి. వీటిని ప‌ల్లి చ‌ట్నీ లేదా ట‌మాటా చ‌ట్నీతో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఎప్పుడూ రెగ్యుల‌ర్ దోశ‌లు మాత్ర‌మే కాకుండా ఇలా స్వీట్ కార్న్‌తో దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటే రుచిని ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Editor

Recent Posts