గర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేవారు ఎప్పుడూ బయటే ఆ పని చేస్తారు. ఇళ్లకు వాళ్లను సహజంగా తీసుకురారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తన గర్ల్ ఫ్రెండ్‌ను ఏకంగా తన ఇంటికే తీసుకొచ్చాడు. మంచి మూడ్‌లో ఉండగా భార్య వచ్చింది. తలుపు కొట్టింది. దీంతో షాకైన ఆ వ్యక్తికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఎలాగోలా తన భార్య నుంచి తప్పించుకున్నాడు. కాగా ఈ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుండగా బయటి నుంచి భార్య వచ్చి ఇంటి డోర్ కొట్టింది. అయితే ఒక్క క్షణం ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ వెంటనే తేరుకుని తన గర్ల్ ఫ్రెండ్‌కు తన దుస్తులను ధరింపజేశాడు. జుట్టును కవర్ చేసేందుకు క్యాప్ పెట్టాడు. పక్కనే ప్లే స్టేషన్ గేమింగ్ కన్సోల్ ఉంది. దాని ఎదుట తన గర్ల్ ఫ్రెండ్‌ను మగవాడి గెటప్‌లో కూర్చోబెట్టి గేమ్స్ ఆడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు.
దీంతో లోపలికి వచ్చిన భార్య అంతగా పట్టించుకోలేదు. తన భర్త ఎవరో తన ఫ్రెండ్‌తో గేమ్స్ ఆడుతున్నాడనుకుని లోపలికి వెళ్లిపోయింది. దీంతో వెంటనే అతను తన గర్ల్ ఫ్రెండ్‌ను అక్కడి నుంచి పంపించేశాడు. చాలా చిత్రంగా ఆ వ్యక్తి తన భార్య బారి నుంచి తప్పించుకున్నాడు. కాగా ఈ సంఘటన మొత్తం సిసిటివి కెమెరాల్లో రికార్డు అవగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది అతని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. కానీ భార్య ఉండగా ఇలాంటి గలీజ్ పనులేంటి అని మొట్టికాయలు వేస్తున్నారు. మరి మీరూ ఆ వీడియోను చూసేయండి.