హెల్త్ టిప్స్

భ‌య‌పెట్టిస్తున్న హార్ట్ ఎటాక్స్.. గోల్డెన్ అవ‌ర్ ఎందుకు కీల‌కం అంటే..?

ఒకప్పుడు గుండెపోటు అంటే ఎక్కువ‌గా ముసలివాళ్లకే వస్తుందనుకునేవాళ్లం.. ఇప్పుడు గుండె సమస్యలకు వయస్సుతో సంబంధం లేకుండా పోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యసనాలతో హార్ట్‌ ఎటాక్‌ ముప్పు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ పోతుంది. గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు తెలుసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడొచ్చు. గుండెకు రక్తం సరఫరా ఆగిపోవడం, లేక రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం తలెత్తితే దాన్ని గుండెపోటు అని అంటారు. గుండెపోటు వచ్చిన సమయంలో ఏం చేయాలో తెలియకపోవడం, కనీసం గంట తర్వాత ఆసుపత్రికి తీసుకురావడం వల్లే అధిక మరణాలు సంభవిస్తుంటాయి.

సాధార‌ణంగా గుండెపోటు రాగానే అంత సమస్య ఉండదని, మొదటి గంట సమయం తర్వాతే ప్రాణాలకు ముప్పు ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అందుకే గుండెపోటు వచ్చిన తర్వాత మొదటి గంట సమయాన్ని ‘గోల్డెన్ అవర్’ అంటారు. సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. తొలి గంటలో గుండెకు రక్తం సరఫరా క్రమక్రమంగా ఆగిపోతుంది. అందుకే హాస్పిటల్‌కు చేరుకునే వరకు.. ముఖ్యంగా దగ్గడం, శ్వాస అధికంగా తీసుకోవడం లాంటివి చేయాలని వైద్యులు సూచ‌న చేస్తున్నారు. మీకు ఛాతీలో నొప్పి వస్తే ఏ మాత్రం లైట్ తీసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత ఈసీజీ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. ఛాతీలో నొప్పి వస్తే జీర్ణ సమస్య, అసిడిటీ అని కొట్టి పారేయవద్దు. కుటుంబ పరంగా జన్యుపరమైన కారణాలతోనూ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

heart attack why golden hour is important

చాలా మంది ఛాతీ నొప్పిని గుండెపోటు ప్రధాన లక్షణంగా భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. గుండెపోటుకు ముందు, మన శరీర భాగాలు అనేక రకాల సంకేతాలను పంపుతాయి. గుండెపోటుకు ముందు శరీరంలోని ఇతర భాగాలలో ఈ కింది లక్షణాలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. కొంత మందికి సైలెంట్ హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఏ లక్షణాలు లేకుండానే గుండెపోటు వస్తే దానినే సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటారు. ఆక్సీజన్ అందకపోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కరోనరీ ధమనులలో ఒకదాని ద్వారా రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల వస్తుంది. ఇది సాధారణ గుండెపోటులా కాకుండా ఇతర లక్షణాల ద్వారా కూడా ఈ సమస్య తెలుస్తుంది.దవడ, మెడ, వీపు, భుజాలు, చేతుల్లో నొప్పి కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలే. ఈ సమయంలో పొత్తికడుపు ఎగువ భాగంలో, వెనుక, దవడలో ఉంటుంది. ఈ నొప్పి వస్తూ తగ్గిపోతుంది. లేదా కొద్దిగా ఇది కండరాల నొప్పి అనుకోవద్దు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిది.

Sam

Recent Posts