వినోదం

Matrudevobhava Movie : క‌ర్చీఫ్‌లు ఫ్రీగా ఇచ్చిన సినిమా.. దీన్ని మిస్ చేసుకుంది ఎవ‌రంటే..?

Matrudevobhava Movie : మాతృదేవోభవ‌. ఈ సినిమా క్లాసిక్ మూవీగా నిలిచి ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. అమ్మ గొప్పతనం గురించి చెప్పే సినిమాలు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలానే వచ్చాయి.. అందులో ఒకటి మాతృదేవోభవ‌. ఇందులో విధివశాత్తూ భర్తను కోల్పోయిన ఒక స్త్రీ, క్యానార్ సోకి తను కూడా కొద్ది రోజుల్లో మరణిస్తానని తెలుసుకొని తన నలుగురు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పడే తపన, ఆరాటమే ఈ సినిమా…అమ్మ ప్రేమకి అసలైన అర్ధం చెప్పిన ఈ సినిమా 1993 లో విడుదలై మంచి విజ‌యం సాధించింది.

నాజర్, మాధవి ల నటన సినిమాకి ప్రాణం పోయ‌గా, మిగ‌తా వారు కూడా వారి వారి పాత్ర‌ల‌లో న‌టించి మెప్పించారు. అయితే మొద‌ట‌గా ఈ సినిమా క‌థ‌ను జీవితా రాజ‌శేఖ‌ర్ ల‌కు వినిపించారు. కానీ ఈ సినిమా లో న‌టించేందుకు జీవిత నిరాక‌రించింది. త‌న భార్య రిజెక్ట్ చేసిన కార‌ణంగా రాజ‌శేఖ‌ర్ కూడా సినిమాని చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఆ స‌మ‌యంలో తండ్రి పాత్ర‌లో నాజ‌ర్‌ని తీసుకోగా, మ‌రో పాత్ర‌లో మాధ‌విని సెల‌క్ట్ చేశారు. ఇక సంగీతం కోసం కీర‌వాణిని సంప్ర‌దించారు. క‌థ విని వెంట‌నే తాను ఓకే చెప్పారు. 1993 అక్టోబ‌ర్ 22 వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేశారు.

Matrudevobhava Movie do you know who missed it

ఈ సినిమా విడుద‌లైన తొలి రోజుల‌లో పెద్ద‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ లేదు. మెల్ల‌మెల్ల‌గా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. రెండు వారాల త‌ర‌వాత థియేట‌ర్ కు వ‌చ్చిన ప్ర‌తిఒక్క‌రికీ ఖ‌ర్చీఫ్ లు ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌ర‌వాత ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ క్ర‌మంలోనే ఆరు కేంద్రాల్లో సినిమా వంద‌రోజులు ఆడింది. విధివశాత్తూ భర్తను కోల్పోయిన శారద తన లాగా తన పిల్లలు కూడా అనాధాశ్రమంలో పెరగడం ఇష్టం లేక వారిని మంచి మనసున్న కుటుంబాలకు దత్తత ఇచ్చి వేస్తుంది. చివరికి తాను చనిపోతుంది. దత్తత ఆయితే ఇచ్చింది కానీ ఆ తరవాత తన పిల్లల కోసం పడే తాపత్రయం కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు.

Admin

Recent Posts