Menthikura Pappu : మెంతికూర‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌ప్పును ఇలా చేసుకోవ‌చ్చు.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..

Menthikura Pappu : మ‌నం మెంతికూర‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించే ఈ మెంతి కూర‌తో మ‌నం చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మెంతికూర పప్పు ఇత‌ర పప్పు కూర‌ల వ‌లె చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. సుల‌భంగా, రుచిగా మెంతికూర ప‌ప్పును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతికూర ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన మెంతికూర – 4 క‌ట్ట‌లు, కందిప‌ప్పు – 100 గ్రా., ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Menthikura Pappu recipe in telugu how to make it
Menthikura Pappu

మెంతికూర ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా ఒక కుక్క‌ర్ లో కందిప‌ప్పు వేసి శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత అందులో ఒక గ్లాస్ నీళ్లు, ప‌సుపు, ఒక టీ స్పూన్ వేసి మూత పెట్టాలి. త‌రువాత ఈ పప్పును మూడు విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మెత్త‌గా ఉడికించాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఇంగువ వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, మెంతికూర‌, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన ప‌ప్పు, చింత‌పండు ర‌సం,అర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌ప్పును లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా మెంతికూర‌తో ప‌ప్పును త‌యారు చేసుకుని తినడం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts