Pumpkin Seeds : మనం గుమ్మడికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మనం సాధారణంగా గుమ్మడికాయను ఆహారంగా తీసుకుని వాటిలో ఉండే గింజలను పడేస్తూ ఉంటాం. కానీ గుమ్మడి గింజల్లో ఉండే పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయని వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఫ్యాటీ ఆమ్లాలు ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. మార్కెట్ లో మనకు విరివిరిగా ఈ గుమ్మడి గింజల పప్పు లభిస్తుంది.
వివిధ రకాల స్వీట్ ల తయారీలో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. గుమ్మడి గింజలను తినడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ లబారిన పడకుండా ఉంటాము. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే గుమ్మడి గింజలను తినడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నశించి క్యాన్సర్ బారిన పడకుండా ఉంటామని ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు.
అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో జీవ రసాయన ప్రక్రియలు సాఫీగా సాగుతాయి. గుమ్మడి గింజలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. నీరసం తగ్గి శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. అలాగే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. గుమ్మడి గింజలను తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అలాగే ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడే వారు ఈ గింజలను తినడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
అదే విధంగా గుమ్మడి విత్తనాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. సంతాన లేమి సమస్యలు తగ్గుతాయి. వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది. లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ విధంగా గుమ్మడి గింజలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.