lifestyle

దోమ‌లు ఎక్కువ‌గా ఎవ‌రిని కుడ‌తాయో తెలుసా ?

వ‌ర్షాకాలం వచ్చిందంటే చాలు దోమ‌లు మ‌న‌పై దండ‌యాత్ర చేస్తుంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంటాయి. అయితే దోమ‌లు ఎవ‌రిని ప‌డితే వారిని కుట్ట‌వ‌ట‌. కేవ‌లం కొన్ని ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు ఉన్న‌వారినే ఎక్కువగా కుడ‌తాయ‌ట‌. మ‌రి వారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందామా..!

* మ‌నం ఆక్సిజ‌న్‌ను పీల్చుకుని కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను విడిచి పెడతాం క‌దా. అయితే దోమ‌లు మ‌నం వ‌దిలే కార్బ‌న్ డ‌యాక్సైడ్ కు ఎక్కువ‌గా ఆకర్షిత‌మ‌వుతాయి. అందుక‌నే అవి మ‌న‌ల్ని కుడ‌తాయి.

* కొంద‌రి శ‌రీరాల నుంచి చెమ‌ట దుర్వాస‌న వ‌స్తుంటుంది. అలాంటి వారిని కూడా దోమ‌లు ఎక్కువ‌గా కుడ‌తాయి.

mosquitoes will bite these people mostly

* మ‌న శ‌రీరం నుంచి వ‌చ్చే వేడిని గ్ర‌హించి దోమ‌లు మ‌న‌ల్ని కుడ‌తాయి. వేడి శ‌రీరం ఉన్న‌వారిని ఎక్కువ‌గా కుడ‌తాయి.

* అధిక బ‌రువు ఉన్న‌వారిని కూడా దోమ‌లు ఎక్కువ‌గా కుడ‌తాయ‌ట‌.

* O గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారిని కూడా దోమ‌లు ఎక్కువగా కుడ‌తాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది.

Admin

Recent Posts