viral news

పెళ్లి కూతురుని బ్యాట్ తో కొట్టిన తల్లి.. వీడియో వైరల్..!

నెట్టింట మనకి ఏదో ఒక వీడియో కనపడుతూనే ఉంటుంది. కొన్ని వీడియోలని చూస్తే షాక్ అయిపోతూ ఉంటాము. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అయ్యింది. చాలా కాలం నుంచి ప్రేమ పెళ్లిళ్లు ఇండియాలో జరుగుతూనే ఉన్నాయి. పైగా చాలామంది పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కంటే వాళ్లే ఎంచుకుని ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు.

ఇక నెట్టింట వైరల్ అవుతున్న వీడియో విషయానికి వచ్చేస్తే.. ఒక యంగ్ కపుల్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వరమాల మార్చుకున్న తర్వాత పెళ్లికూతురు తల్లి ఆమెని బ్యాట్ పెట్టి గట్టిగా కొట్టింది. ఈ వీడియోని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక పోవడం వలన వీళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉండొచ్చు.

mother hits her daughter with bat video viral

వరమాల మార్చుకున్న తర్వాత క్రికెట్ బ్యాట్ పెట్టి తల్లి కొట్టింది. అయితే వాళ్ళు ఎవరనే వివరాలు మాత్రం అక్కడ రాసి లేవు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. 340 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆమెను ఇండియన్ క్రికెట్ టీం లోకి పంపించమని పలువురు నెట్టింట సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Peddinti Sravya

Recent Posts