OTT : ఈ వారం ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్న సిరీస్‌లు, సినిమాల వివ‌రాలు..!

OTT : ప్ర‌తి శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో కొత్త సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ట్లే ఓటీటీల్లోనూ కొత్త మూవీలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే వారం వారం ఓటీటీల్లో విడుద‌ల‌య్యే సినిమాల‌ను చూసేందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇక ఈ వారం కూడా కొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీల్లో సంద‌డి చేయ‌నున్నాయి. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

movies and series that will stream on OTT apps this week
OTT

మార్చి 18 నుంచి జీ5 యాప్‌లో బ్ల‌డీ బ్ర‌ద‌ర్స్ అనే హిందీ షో ప్ర‌సారం కానుంది. డ్రామా జోన‌ర్‌లో దీన్ని తెర‌కెక్కించారు. అదే తేదీన అమెజాన్ ప్రైమ్‌లో డీప్ వాట‌ర్ అనే హాలీవుడ్ చిత్రం స్ట్రీమ్ కానుంది. డ్రామా, రొమాన్స్‌, థ్రిల్ల‌ర్‌గా దీన్ని తెర‌కెక్కించారు. ఇక అదే తేదీన అమెజాన్ ప్రైమ్‌లో జ‌ల్సా అనే హిందీ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇందులో విద్యాబాల‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. డ్రామా, థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ మూవీని తెర‌కెక్కించారు.

ఇక మార్చి 18 నుంచి ఆహాలో జూన్ అనే టీవీ షో స్ట్రీమ్ కానుంది. అదే తేదీన డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ల‌లితం సుంద‌రం అనే మ‌ళ‌యాళం మూవీ స్ట్రీమ్ కానుంది. కామెడీ, డ్రామా, ఫ్యామిలీ క‌థాంశంతో ఈ సినిమా వ‌చ్చింది. ఇక మార్చి 18న సోనీ లివ్ యాప్‌లో శాల్యూట్ అనే మ‌ళ‌యాళం సినిమా స్ట్రీమ్ కానుంది. దుల్క‌ర్ స‌ల్మాన్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. థ్రిల్ల‌ర్ కథాంశంతో ఈ మూవీని తెర‌కెక్కించారు.

అలాగే మార్చి 18వ తేదీన ఆహాలో సెబాస్టియ‌న్ పీసీ 524 అనే తెలుగు సినిమా స్ట్రీమ్ కానుంది. థ్రిల్ల‌ర్‌, కామెడీ జోన‌ర్‌ల‌లో ఈ మూవీ అల‌రిస్తుంది. ఇక ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు.

Editor

Recent Posts