Rashmi Gautam : బుల్లితెరపై రష్మి గౌతమ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె యాంకర్‌గా రాణిస్తూనే గతంలో పలు సినిమాలు చేసింది. కానీ అవేవీ ఈమెకు హిట్‌ను అందించలేకపోయాయి. అయితే ప్రస్తుతం ఈమె కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం అయింది. సినిమాల్లో చేయడం లేదు. కానీ ఈమె గురించిన ఓ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈమె గతంలో తనను మోసం చేసిందని.. బాగా ఇబ్బందులకు గురి చేసిందని.. ఓ సీనియర్ నిర్మాత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
రష్మి గౌతమ్ అప్పట్లో గుంటూరు టాకీస్ అనే సినిమా చేసింది. అయితే అదే సమయంలో సీనియర్ నిర్మాత బాలాజీ నాగ లింగం ఆమెతో సినిమా చేసేందుకు యత్నించారు. కాగా అప్పట్లో ఆమె ఒకానొక దశలో హీరోను మార్చేయాలని పట్టుబట్టిందని ఆయన తెలిపారు. తనకు నాగబాబు తెలుసని, మల్లెమాల శ్యాం ప్రసాద్ రెడ్డి తెలుసని.. తాను చెప్పింది చెప్పినట్లు చేయకపోతే టీవీ9కు ఎక్కి మొత్తం చెప్పేస్తానని ఆమె బెదిరించిందని అన్నారు. అయితే చివరకు ఆమె ఎలాగోలా నటించేందుకు ఒప్పుకుందని.. దీంతో సినిమాను కంప్లీట్ చేశామని తెలిపారు. అలా రష్మి గౌతమ్ తమను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అయితే అలా రష్మి గౌతమ్ ప్రవర్తించినా ఆమెను ఏమీ అనలేదని.. చివరకు 3 నెలల పాటు వచ్చి ఆమె షూటింగ్‌లో పాల్గొందని అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై రష్మి గౌతమ్ స్పందించాల్సి ఉంది.