Mushroom Cultivation : ఆదాయం లేని వారికి చ‌క్క‌ని మార్గం.. పుట్ట గొడుగుల పెంప‌కం.. నెల‌కు ఎంత సంపాదించ‌వ‌చ్చంటే..?

Mushroom Cultivation : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. క‌రోనా వ‌ల్ల ఎంతో మంది ఉద్యోగాల‌ను, ఉపాధిని కోల్పోయారు. అయితే ఎక్క‌డా ఉద్యోగం రావ‌డం లేద‌ని బాధ‌ప‌డేవారు స్వ‌యం ఉపాధి మార్గాల‌ను ఎంచుకోవాలి. దీంతో ఆర్థిక స్థిర‌త్వం ల‌భించ‌డ‌మే కాదు.. ఉద్యోగ భ‌ద్ర‌త కూడా ఉంటుంది. సొంత వ్యాపార‌మే క‌నుక ఎలాంటి దిగులు చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇక ప్ర‌స్తుతం చాలా మంది అనేక స్వ‌యం ఉపాధి మార్గాల్లో రాణిస్తున్నారు. అలాంటి వారు చేయ‌ద‌గిన వ్యాపారాల్లో పుట్ట గొడుగుల పెంప‌కం ఒక‌టి. స‌రిగ్గా చేయాలే కానీ ఇందులోనూ అనేక లాభాల‌ను గ‌డించ‌వ‌చ్చు.

పుట్ట‌గొడుగుల‌ను పెంచేందుకు పెట్టుబ‌డి పెద్ద‌గా అవ‌సరం ఉండ‌దు. సొంత స్థ‌లం ఉంటే చాలా వ‌ర‌కు ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఇక భారీ యంత్రాల‌ను కొనాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇంటి వ‌ద్ద చిన్న స్థ‌లం లేదా షెడ్డు లాంటిది ఉంటే చాలా సుల‌భంగా ఈ వ్యాపారం చేయ‌వ‌చ్చు. ఇది నిరుద్యోగుల‌కే కాదు.. మ‌హిళ‌ల‌కు కూడా చ‌క్క‌ని స్వ‌యం ఉపాధి మార్గం. ఇక చాలా త‌క్కువ స‌మ‌యంలోనే పంట వ‌స్తుంది. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు చేతి నిండా ఆదాయం కూడా ఉంటుంది.

Mushroom Cultivation very profitable self employment
Mushroom Cultivation

పుట్ట గొడుగుల‌ను పెంచేందుకు ముంద‌స్తుగా ఎలాంటి అవ‌గాహ‌న లేక‌పోయినా ఫ‌ర్లేదు. ప్ర‌స్తుతం అనేక చోట్ల పుట్ట గొడుగ‌లు పెంప‌కంపై శిక్ష‌ణ‌ను ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో వారి వివ‌రాల‌ను తెలుసుకుని శిక్ష‌ణ తీసుకుంటే చాలు. ఇది ఒక నెల రోజుల పాటు ఉంటుంది. అంతే.. దీంతో మీకు మీరే స్వ‌యంగా పుట్ట‌గొడుగుల‌ను పెంచ‌వ‌చ్చు. ఇక వీటిని పెంచేందుకు చాలా త‌క్కువ స్థ‌లం అవ‌స‌రం అవుతుంది. అలాగే ఖ‌ర్చు కూడా త‌క్కువ‌గానే ఉంటుంది.

1 కిలో పుట్ట‌గొడుగుల‌ ఉత్ప‌త్తికి ఖ‌ర్చు సుమారుగా రూ.34 వ‌ర‌కు అవుతుంది. ఇక మార్కెట్‌లో 1 కిలో పుట్ట గొడుగుల ధ‌ర సుమారుగా రూ.250 నుంచి మొద‌ల‌వుతుంది. అంటే ఖ‌ర్చు తీసేస్తే.. 1 కిలో పుట్ట గొడుగుల‌పై మ‌న‌కు రూ.216 ఆదాయం వ‌స్తుంద‌న్న‌మాట‌. అయితే పుట్ట గొడుగులు మ‌న‌కు ఒక‌సారి పంట వేస్తే 25 రోజుల్లో చేతికి వ‌స్తుంది. అంటే నెల నెలా ఆదాయం త‌ప్ప‌కుండా ఉంటుంది. ఈ క్ర‌మంలో నెల‌కు 100 కిలోల పుట్ట‌గొడుగుల‌ను పెంచితే ఎంత లేద‌న్నా క‌నీసం రూ.20వేల ఆదాయం పొంద‌వ‌చ్చు. అయితే ఒక‌సారి బాగా అల‌వాట‌య్యాక పంట మొత్తాన్ని పెంచుతూ పోతే దిగుబ‌డి కూడా ఎక్కువ‌గా వ‌స్తుంది. దీంతో నెల‌కు ఒక ట‌న్ను అంటే.. 1000 కిలోల పుట్ట‌గొడుగుల‌కు ఎంత లేద‌న్నా రూ.2 ల‌క్ష‌ల మేర ఆర్జించ‌వ‌చ్చు. ఇలా పుట్ట‌గొడుగుల పెంప‌కం లాభ‌సాటిగా ఉంటుంది.

అయితే వీటి పెంప‌కం సుల‌భ‌మే అయినా.. వీటిని అమ్మ‌డం కాస్త శ్ర‌మ‌తో కూడుకున్న ప‌ని. సూప‌ర్ మార్కెట్లు, హోట‌ల్స్ వంటి వారితో భాగ‌స్వామ్యం అయితే నెల నెలా పుట్ట‌గొడుగుల‌ను వారికి స‌ర‌ఫ‌రా చేస్తూ.. స్థిర‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. ఇలా పుట్టగొడుగుల పెంప‌కంతో చ‌క్క‌ని స్వ‌యం ఉపాధిని పొంద‌వచ్చు.

Editor

Recent Posts