Mutton Liver Curry : మ‌ట‌న్ లివ‌ర్‌ను ఇలా వండాలి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Mutton Liver Curry : మ‌నం మ‌ట‌న్ లివ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మాంసాహార ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మ‌ట‌న్ లివ‌ర్ లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ ఎ, విట‌మిన్ బి 12, జింక్, ఐర‌న్, కాప‌ర్, ఫోలిక్ యాసిడ్ వంటి పోష‌కాలు మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. ఈ మ‌ట‌న్ లివ‌ర్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కర్రీని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రుచిగా, సుల‌భంగా మ‌ట‌న్ లివ‌ర్ తో కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ లివ‌ర్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ లివ‌ర్ – పావుకిలో, నూనె – 4 టీ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ప‌సుపు – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Mutton Liver Curry recipe in telugu very tasty easy to cook
Mutton Liver Curry

మ‌ట‌న్ లివ‌ర్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్కలు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత శుభ్రంగా క‌డిగిన మ‌ట‌న్ లివ‌ర్ ను వేసి క‌ల‌పాలి. దీనిని 10 నిమిషాల పాటు బాగా వేయించాలి. త‌రువాత టమాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కారం, ఉప్పు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత ఉంచి లివ‌ర్ మెత్త‌గా ఉడికి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి.

ఇలా ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ లివ‌ర్ కర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పూరీ, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన లివ‌ర్ కర్రీని తిన‌డం వల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts