Mutton Liver Kurma : మ‌ట‌న్ లివ‌ర్‌ను ఇలా కుర్మా లాగా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Mutton Liver Kurma : మ‌నం మ‌ట‌న్ తో పాటు మ‌ట‌న్ లివ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. నాన్ వెజ్ ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ లివ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దీనిలో విట‌మిన్ ఎ, బి, కాప‌ర్, ఐర‌న్, ఫోలిక్ యాసిడ్ ఇలాఅనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. మ‌ట‌న్ లివ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం త‌గ్గుతుంది. ఇలా మ‌ట‌న్ లివ‌ర్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది ఈ మ‌ట‌న్ లివ‌ర్ ను వేయించి సైడ్ డిష్ గా తీసుకుంటూ ఉంటారు. ఫ్రై తో పాటు మ‌ట‌న్ లివ‌ర్ తో ఎంతో రుచిగా ఉండే లివ‌ర్ కుర్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ మ‌ట‌న్ లివ‌ర్ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ లివ‌ర్ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, నూనె – పావు క‌ప్పు, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కారం -ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, ప‌చ్చి కొబ్బ‌రి పేస్ట్ – అర క‌ప్పు, నీళ్లు – 500 ఎమ్ ఎల్, మ‌ట‌న్ లివ‌ర్ – అర‌కిలో, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – అర క‌ట్ట‌.

Mutton Liver Kurma recipe in telugu very tasty
Mutton Liver Kurma

మ‌ట‌న్ లివ‌ర్ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా ఉల్లిపాయ ముక్క‌ల‌ను, ప‌చ్చిమిర్చిని జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత కొబ్బ‌రి పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత లివ‌ర్ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి.

లివ‌ర్ ముక్క‌లు ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత గ‌రం మ‌సాలా, కొత్తిమీర వేసిమ‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ లివ‌ర్ కుర్మా త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మ‌ట‌న్ లివ‌ర్ తో కుర్మాను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts