Sleep Secrets : మన శరీరానికి నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మనం కనీసం రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్ర పోవాలని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే మనం రోజూ తగినంత నిద్ర పోవాలని నిపుణులు చెబుతున్నారు. నిద్ర పోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి తెలిస్తే మనలో చాలా మంది ఎక్కువ సమయం నిద్ర పోవడానికి ప్రయత్నిస్తారు. కనుక నిద్ర పోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రపోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. పగలంతా పని చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరిగి శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
అదే మనం నిద్రించే సమయంలో రక్తప్రసరణ వేగం తగ్గుతుంది. దీంతో శరీర ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. అలాగే మనం పగటి సమయంలో అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాము. దీంతో మెదడు కణాల్లో అనేక వ్యర్థాలు, రసాయనాలు విడుదల అవుతాయి. ఇలా మెదడు కణాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, రసాయనాలు తొలగిపోవాలంటే మనం నిద్రించాలి. మనం నిద్రించడం వల్ల మెదడుకు రక్తప్రసరణ ఎక్కువగా జరుగుతుంది. దీంతో మెదడు కణాలు శుభ్రపడి మరుసటి రోజు చురకుగా పని చేస్తాయి. అలాగే 20 సంవత్సరాల వయసు లోపు పిల్లలల్లో ఎముకలు రాత్రి పూట ఎక్కువగా పెరుగుతాయి. నిద్రించడం వల్ల వారిలో ఎదుగుదల వేగంగా ఉంటుంది.
ఈ విధంగా పిల్లల ఎదుగుదలో నిద్ర సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా నిద్రించడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు కూడా విశ్రాంతి లభిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే మనం రోజంతా పని చేయడం వల్ల మన శరీరంలో కండరాలు బలహీనంగా తయారవుతాయి. ఇలా బలహీనంగా మారిన కండరాలు తిరిగి శక్తిని పొందాలన్నా, కండరాలు తిరిగి బలంగా తయారవ్వాలన్నా, మరుసటి రోజూ మనం ఉత్సాహంగా పని చేసుకోవాలన్నా మనం రాత్రి సమయంలో తగినంత నిద్రించడం వల్ల చాలా అవసరం. నిద్రించడం వల్ల కండ పుష్టి చక్కగా ఉండడంతో పాటు కండరాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే నిద్రించడం వల్ల మనకు కళలు వస్తూ ఉంటాయి.
నిత్య జీవితంలో జరగని కొన్ని సంఘటనలను మనం కళల రూపంలో అనుభూతి చెందవచ్చు. అదే విధంగా మనం రాత్రి సమయంలో త్వరగా తిని నిద్రించాలి. ఇలా చేయడం వల్ల పొట్ట, ప్రేగులలకు ఎంతో విశ్రాంతి లభించి జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. ఇక అందంగా, యవ్వనంగా కనబడాలనుకునే వారు ఖచ్చితంగా రాత్రి ఎక్కువ సమయం నిద్రించాలి. నిద్రించడం వల్ల కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో మన చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. నిద్రించడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు అన్నీ తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. ఈ విధంగా నిద్రించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇకనైనా సెలఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటిని చూడకుండా త్వరగా తినేసి రోజూ 7 నుండి8 గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలని వారు సూచిస్తున్నారు.