Mysore Bonda Without Maida : మైదా లేకుండా మైసూర్ బొండాల‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Mysore Bonda Without Maida : మ‌న‌కు హోటల్స్, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే అల్పాహారాల్లో మైసూర్ బోండాలు కూడా ఒక‌టి. మైసూర్ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే వీటిని త‌యారు చేయ‌డానికి మైదాపిండిని వాడుతారు. కానీ మైదాపిండి మ‌న ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మైదాపిండిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వంటి వ్యాధుల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే బ‌రువు పెరిగే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక చాలా మంది మైదాపిండికి బదులుగా గోధుమ‌పిండితో వంట‌కాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మైదాపిండితో త‌యారు చేసే ఈ మైసూర్ బోండాల‌ను అదే రుచితో మ‌నం గోధుమ‌పిండితో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమ‌పిండితో చేసే ఈ మైసూర్ బోండాలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది. రుచిగా గోధుమ‌పిండితో మైసూర్ బోండాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మైసూర్ బోండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ‌పిండి – ఒక క‌ప్పు, బియ్యంపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, పుల్ల‌టి పెరుగు – ఒక కప్పు, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

Mysore Bonda Without Maida make in this method recipe is here
Mysore Bonda Without Maida

మైసూర్ బోండా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో బియ్యంపిండి, ఉప్పు, జీల‌క‌ర్ర‌, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ బోండా పిండిలాగా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత పిండిని మ‌రోసారి క‌లుపుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. త‌రువాత పిండిని తీసుకుని గుండ్రంగా చేసుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై అటూ ఇటూ క‌దుపుతూ ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి మైసూర్ బోండాలు త‌యార‌వుతాయి. వీటిని చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా గోధుమ‌పిండితో బోండాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

Share
D

Recent Posts