వినోదం

Samantha : చై – సామ్ విడి పోతారని.. అమల, నాగార్జునకు ముందే తెలుసా ?

Samantha : సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నాం.. అనే విషయాన్ని తెలియజేశారు. ఇలా ఒక్కసారిగా ఈ విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఎంతో షాక్ కి గురయ్యారు. అయితే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అంత‌కు కొన్ని నెలల క్రితమే నాగార్జున, అమలతో చెప్పినట్లు సమాచారం.

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ వివాహ బంధం నుంచి విడిపోవాలని భావించి ఈ విషయాన్ని నాగార్జున, అమల దగ్గర చెప్పగానే అందుకు వారిద్దరూ ఏ విషయమైనా మరింత లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఒక్కసారి వివాహబంధంలో విడిపోతే జీవితాంతం ఆ బాధ వెంటాడుతుందని, కనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

naga chaitanya and samantha separation nagarjuna and amala know it

అయితే సమంత, నాగచైతన్య బాగా ఆలోచించి తమ వివాహ బంధంలో విడిపోవాలని నిర్ణయించుకొని ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. వీరి విడాకుల తర్వాత నాగ్ స్పందిస్తూ.. చైతన్య, సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని, వారు విడిపోవడం చాలా బాధగా ఉందని, వారిద్దరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఎమోషనల్ అయ్యారు.

Admin

Recent Posts